రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకే కాకుండా కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరలో 5 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రోత్సాహకం మార్చి 2027 వరకు వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో రిజిస్టరైన ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను నుంచి ఐదేళ్ల మినహాయింపు కల్పించడం ద్వారా ఈవీల వైపు మళ్లేలా ప్రజలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్లను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టుగా మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే.. మొదటి 5,000 ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఇన్‌స్టాలేషన్ ఖర్చులో 25 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించినట్టుగా చెప్పారు.
భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. ఆగస్టులో దేశవ్యాప్తంగా సుమారు 2.98 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. ఇది ఈ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని చెప్పారు.
మొత్తం వాహన మార్కెట్‌లో ఈవీల వాటా 9.5 శాతం నుండి 12.3 శాతానికి పెరిగిందన్నారు మంత్రి రాంప్రసాద్. భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2029 నాటికి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కనీసం 10,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 20,000 కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. అదే సమయంలో ప్రజా రవాణాలో ఈవీల వినియోగాన్ని కూడా విస్తరించాలని అన్నారు.
ప్రతి 30 కి.మీకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఇ-మొబిలిటీ నగరాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటి చర్యలు రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను నిర్మించడంలో దోహదపడతాయని మంత్రి రాంప్రసాద్ అన్నారు. దేశంలోనే ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
{{/usCountry}}ప్రతి 30 కి.మీకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఇ-మొబిలిటీ నగరాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటి చర్యలు రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను నిర్మించడంలో దోహదపడతాయని మంత్రి రాంప్రసాద్ అన్నారు. దేశంలోనే ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
{{/usCountry}}