ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి, దివంగత హీరాబెన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మితమవుతోంది. తల్లిపై కుమారుడికి ఉండే అపారమైన భక్తిప్రపత్తులకు, గౌరవానికి ప్రతీకగా కర్నూలు జిల్లాలో ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలోని అర ఎకరం స్థలంలో మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ భూమిపూజ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశేషమేమిటంటే ఈ కార్యక్రమానికి బీజేపీతో పాటు జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తల్లిగారికి ఆలయం నిర్మించడం దేశంలోనే ఇది మొట్టమొదటిదని పేర్కొన్నారు. 'ప్రధానమంత్రి దేశానికి పెద్దదిక్కు. అలాంటి గొప్ప నాయకుడికి జన్మనిచ్చిన మాతృమూర్తికి ఆలయం నిర్మించడం అంటే, దేశంలోని సమస్త తల్లులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించాలి.' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆలయ నిర్మాణ వివరాలను మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు శివకుమార్ మీడియాకు వెల్లడించారు. దాతల నుంచి విరాళాలు సేకరించి ఈ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. హీరాబెన్ మోదీకి నివాళిగా సుమారు రూ.3 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించామని, విగ్రహ ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉందని శివకుమార్ పేర్కొన్నారు.
ఈ ఆలయ సముదాయంలో హీరాబెన్ మోదీ మందిరంతో పాటు పరమశివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, మహాగణపతి ఆలయాలను కూడా నిర్మిస్తున్నట్లు వివరించారు. దాతల ఉదార విరాళాలతో రాబోయే రెండు నెలల్లోనే ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసి, విగ్రహ ప్రతిష్ఠాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
కేవలం ఆలయ నిర్మాణానికే పరిమితం కాకుండా ఈ ప్రాంగణంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని ఛారిటబుల్ సొసైటీ నిర్ణయించింది. ఆలయ సముదాయంలో భాగంగా అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక అనాథాశ్రమం, గోవుల సంరక్షణార్థం ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శివకుమార్ వెల్లడించారు. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
{{/usCountry}}కేవలం ఆలయ నిర్మాణానికే పరిమితం కాకుండా ఈ ప్రాంగణంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని ఛారిటబుల్ సొసైటీ నిర్ణయించింది. ఆలయ సముదాయంలో భాగంగా అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక అనాథాశ్రమం, గోవుల సంరక్షణార్థం ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శివకుమార్ వెల్లడించారు. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
{{/usCountry}}