...
...
Next Story

ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు

ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం అనేది ప్రైవేటీకరణ కిందకు రాదని కార్పొరేషన్ స్పష్టం చేసింది. జీసీసీ నమూనా ఆర్టీసీ కొత్తేమి కాదని తెలిపింది.

Published on: May 18, 2026, 14:11:55 IST
Advertisement

గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) విధానం కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం అనేది కార్పొరేషన్ ప్రైవేటీకరణ కిందకు రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) స్పష్టం చేసింది. అలాగే.. కొన్ని వర్గాలలో ప్రచారంలో ఉన్న నివేదికలు తప్పుదోవ పట్టించేవని పేర్కొంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ప్రజలు, ఉద్యోగులలో నెలకొన్న అపోహలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది.

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు

దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 'పీఎం ఈ-బస్ సేవా పథకాన్ని' ప్రారంభించిందని కార్పొరేషన్ పేర్కొంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. జీసీసీ నమూనా తమ కార్పొరేషన్‌కు కొత్తేమీ కాదని ఏపీఎస్ఆర్టీసీ వివరించింది.

కేంద్రం ఫేమ్-II పథకం కింద 2021లోనే 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టామని, అవి ప్రస్తుతం తిరుపతి-తిరుమల, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-కడప, ఇతర మార్గాల్లో విజయవంతంగా నడుస్తున్నాయని ఆర్టీసీ తెలిపింది. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి ఇప్పుడు 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కార్పొరేషన్ తెలిపింది. దీనికి అదనంగా, ప్రతిపాదిత 'గ్రీన్ కారిడార్'లో భాగంగా తిరుపతి-తిరుమల మార్గానికి ప్రత్యేకంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం మంజూరు చేసింది.

సివిల్ మౌలిక సదుపాయాలకు 60 శాతం, విద్యుత్ మౌలిక సదుపాయాలకు 100 శాతం గ్రాంటుతో సహా కేంద్రం గణనీయమైన ఆర్థిక సహాయం అందిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. 750 బస్సుల ఛార్జింగ్, నిర్వహణ సౌకర్యాల కోసం రూ. 145.39 కోట్ల గ్రాంటును మంజూరు చేశారు. ఈ పథకం కింద కార్పొరేషన్‌కు దాదాపు రూ. 1,774 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు కూడా అందనున్నాయి.

విద్యుత్ బస్సుల ప్రవేశం వల్ల దీర్ఘకాలంలో పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు స్పష్టం చేశారు. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని, ఆధునిక సదుపాయాలను, మెరుగైన నిర్వహణ సామర్థ్యాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

'విద్యుత్ బస్సుల ప్రవేశం వల్ల ఉద్యోగులపై ఏ విధంగానూ ప్రతికూల ప్రభావం పడదు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం లేదా జీసీసీ నమూనా అమలు కారణంగా ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు ఉద్యోగుల ప్రయోజనాలను మరింతగా పరిరక్షించేందుకు భవిష్యత్తులో అవసరమైన చోట 'డ్రై లీజు నమూనా'ను పరిశీలించే అవకాశం ఉంది.' అని కృష్ణబాబు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe