...
...
Next Story

Milk and Ghee Adulteration : పాలు, నెయ్యి కల్తీని గుర్తించండి ఇలా.. తెలిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

Milk and Ghee Adulteration : పాలలో కల్తీని గుర్తించాలని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి అన్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

Published on: Mar 10, 2026, 18:20:07 IST
Advertisement

పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత శాఖ ( ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) వెల్లడించింది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పంచుకుంది. అవి ఏంటంటే.. ఏటవాలుగా పళ్లాన్ని ఉంచి పాల చుక్కను వదిలినప్పుడు.. స్వచ్ఛమైన పాలు కనుక అయితే తెల్లటిధార మాదిరిగా దిగుతుంది. అదే నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండా త్వరగా కిందకి దిగిపోతుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ తెలిపింది. ఇలా చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా కల్తీ పాలు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండవచ్చు అని పేర్కొంది.

కల్తీ పాలు, నెయ్యిని గుర్తించడం ఎలా?
కల్తీ పాలు, నెయ్యిని గుర్తించడం ఎలా?

రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశించిన ప్రకారం... కల్తీ పాలను ఎలా గుర్తించాలి అన్నదానిపై ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ) నీలకంఠారెడ్డి ఓ ప్రకటన జారీ చేశారు.

ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారు పాలు, పాల ఉత్పత్తుల్లో జరిగే కల్తీని ఎలా కనుగొనాలో తెలియజేస్తూ పేర్కొన్న అంశాలను కరపత్రాలు, పుస్తకాల రూపంలో ప్రచురించి విద్యా సంస్థలకు పంపిణీ చేయబోతున్నట్లు ఐపీఎం డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. వీటి ద్వారా ముఖ్యకూడళ్లలోనూ ప్రచారాన్ని జరుపుతామన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

ఏదైనా కలిస్తే ఎలా తెలుసుకోవాలి?

ఓ గ్లాసులో 10 ఎంఎల్ పాలు, 10 ఎంఎల్ నీటిని కలిపి, బాగా కదలించాలి. అప్పుడు పై భాగంలో మందమైన నురుగు ఏర్పడుతుంది. అదే స్వచ్ఛమైన పాలు అయినట్లయితే నురుగ రాదు. నురుగ వస్తే మాత్రం కల్తీ జరిగినట్లు గుర్తించాలి.

రంగు మారితే

బంగాళాదుంప లేదా చిలకడ దుంప, ఇతర పిండి పదార్థాలను నెయ్యిలో కలిపారా? లేదా అని తెలుసుకోవడానికి ఒక స్పూన్ నెయ్యిని చిన్న గాజు గిన్నెలో వేయాలి. తర్వాత రెండు, మూడు చిన్న అయోడిన్ ఉప్పు ద్రావణాన్ని వేయాలి. అప్పుడు నెయ్యి నీలం రంగులోనికి మారితే కల్తీ జరిగినట్లు భావించాలి.

నెయ్యిలో వనస్పతి, పామాయిల్ ఉందా లేదో తెలుసుకోవాలంటే?

ఒక స్పూన్లో నెయ్యి తీసుకుని, కొంచెం చక్కెర కలిపి వేడిచేసినప్పుడు అది ఎరుపు లేదా పింక్ రంగులోనికి మారితే వనస్పతి కలిపినట్లు గుర్తించాలి. అలాగే గ్లాస్ వేడినీటిలో స్పూన్ నెయ్యిని వేస్తే.. ఒరిజనల్ నెయ్యి అయిన పక్షంలో అది పైన తేలుతుంది. వనస్పతి కలిపిన నెయ్యి అయితే చిన్నచిన్న ముద్దులుగా మారి కనిపిస్తుంది.

ఒక చుక్క నెయ్యిని అరచేతిలోనికి తీసుకుని గట్టిగా రుద్దినట్లయితే సువాసన రావాలి. సువాసన రాకుండా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా భావించాలి.

ఫిర్యాదు చేయండి ఇలా..

కల్తీ ఘటనల గురించి తెలిస్తే 1800425 3857(టోల్-ఫ్రీ నెంబరు), 08645297245 (ఐపీఎం ప్రధాన కార్యాలయం)కు తెలియజేయాలని డైరెక్టర్ నీలకంఠారెడ్డి సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks