...
...
Next Story

రాజమండ్రి సమీపంలో పెద్దపులి.. పగలు రెస్ట్, రాత్రి సమయంలో వేట!

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇక రాజమండ్రి సమీపంలో తిరుగుతున్న పెద్దపులి జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Published on: Feb 5, 2026, 09:42:28 IST
Advertisement

మహారాష్ట్ర తడోబా పులుల అభయారణ్యం నుండి ఛత్తీస్‌ఘడ్‌ , తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్దపులి ప్రయాణించి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో జనావాసాలలోకి ప్రవేశించడం ఆందోళనలు కలిగిస్తుంది. రాజమండ్రి నగర శివార్లలో పులి కదలిక అటవీ అధికారులను, నివాసితులను అప్రమత్తం చేసింది. రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

రాజమండ్రి సమీపంలో పెద్దపులి
రాజమండ్రి సమీపంలో పెద్దపులి

రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో మొదట కనిపించడానికి ముందు ఏలూరు వైపు నుండి పెద్దపులి గోదావరి నదిని దాటినట్లుగా చెబుతారు. అది వచ్చిన వెంటనే ఆవులు, దూడపై దాడి చేసి చంపింది. తర్వాత స్థానికుల్లో భయాన్ని పెంచింది.

రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక పులి రోజుకు 15 నుండి 25 కిలోమీటర్ల మధ్య ప్రయాణిస్తుండగా, ఈ పెద్దపులి గత ఐదు రోజులుగా రాజమండ్రికి 10 నుండి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉందని, దీనివల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులను నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.

మంగళవారం రాత్రి దివాన్ చెరువు సెంటర్ సమీపంలోని జాతీయ రహదారి సమీపంలో పులి కనిపించడంతో ఆందోళన పెరిగింది. ఇది ఒక కార్పొరేట్ పాఠశాల, ఓ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో కనిపించింది. కార్లలో ప్రయాణిస్తున్న ప్రజలు రోడ్డుపై ఆగిపోయారు. ప్రత్యక్ష సాక్షులు రికార్డ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫంక్షన్ హాల్ సమీపంలోని గోడపై నుండి పులి దూకుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఆ పులి ఇప్పటివరకు దాదాపు 650 కిలోమీటర్లు ప్రయాణించిందని, మనుషులపై దాడి జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. జంతువు ఆహారం కోసం మాత్రమే పశువులను చంపిందని చెప్పారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు నొక్కి చెబుతున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు బోన్లు, ట్రాప్ కెమెరాలను అమర్చారు. నామవరం శాటిలైట్ సిటీ వద్ద అక్కమ్మతల్లి కొండపై ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. పగలు రెస్ట్ తీసుకుని, రాత్రి సమయంలో వేటాడుతుండటంతో పులిని పట్టుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe