...
...
Next Story

తిరుమల బ్రహ్మోత్సవాలు : మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

Tirumala Brahmotsavams 2026 : తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మలయప్పస్వామి మోహనరూపంలో భక్తులను కటాక్షించారు.

Published on: Sep 19, 2026, 12:37:51 IST
Advertisement

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు.

మోహినీ అలంకారంలో మలయప్ప
మోహినీ అలంకారంలో మలయప్ప

గజరాజులు ముందుగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ రూపంలో స్వామివారి దర్శనం జగత్తును ఆవరించిన మాయామోహాన్ని అధిగమించి భగవంతుని శరణు పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సర్వమూ భగవంతుని లీలావిలాసమేనని, భక్తి మార్గమే మాయామోహాల నుంచి విముక్తికి దారి చూపుతుందని ఈ అలంకారం చాటిచెబుతోంది.

పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన గరుడ వాహనసేవకు 108 వైష్ణవ దివ్యదేశాల్లో విశిష్ట స్థానం ఉంది. భగవంతుని వాహనమైన గరుడుని దర్శించడం ద్వారా భక్తిలో శరణాగతి, జ్ఞానం, వైరాగ్యం కలగాలని స్వామివారు అనుగ్రహిస్తున్నారనే విశ్వాసం ఉంది. గరుడుని దర్శనం సర్వపాపాలను హరిస్తుందని, భక్తులకు ఆధ్యాత్మిక శుభఫలాలను ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఈ వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

స్వామి పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీ గరుడసేవ కారణంగా ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతిచ్చారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు భక్తులను పుష్కరిణిలో స్నానమాచరించేందుకు అనుమతిస్తారు. అయితే గరుడసేవ రోజున భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఉదయం 3 గంటల నుండే పుష్కరిణిని తెరిచి భక్తులను అనుమతించింది టీటీడీ.

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks