TTD Update : శ్రీవారి దర్శన సమయంపై భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. ఈ నిబంధన కఠినంగా అమలు

TTD Update : శ్రీవారి దర్శనంపై భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. దర్శన సమయానికి సంబంధించిన నిబంధనను కఠినంగా అమలు చేస్తామని తెలిపింది.

Published on: Mar 10, 2026, 20:03:36 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను టీటీడీ కఠినంగా అమలు చేస్తోందని వెల్లడించింది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించింది. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కోరింది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

మరోవైపు ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26న ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, అవసరమైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. పెండింగ్‌లో ఉన్న ప్రధాన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఇటీవల ఆదేశించారు. ముఖ్యంగా మసకబారిన వాహనాలకు పాలిషింగ్ చేయడం, అభిషేకం పీఠం, తాండ్లు తదితర వస్తువులకు బ్రాస్ లైనింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గజ వాహనానికి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు.

ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయం చుట్టుపక్కల వీధుల్లో కూల్ పెయింటింగ్ వేయాలని సూచించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరచేందుకు ఆర్.ఓ. వాటర్ ప్లాంట్లు, కూలర్ల నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాష్‌రూమ్స్ / టాయిలెట్స్‌లో అవసరమైన ట్యాపులు, తలుపులు, కమోడ్లకు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని చెప్పారు.

యాగశాలను అందంగా, శాస్త్రీయంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కోరారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More