...
...
Next Story

చంద్ర గ్రహణం ఎఫెక్ట్ : తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత - సాయంత్రం తర్వాత భక్తులకు అనుమతి

చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమాల తర్వాత సాయంత్రం భక్తులను అనుమతిస్తారు.

Published on: Mar 03, 2026 01:34 PM IST
Advertisement

చంద్ర గ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేశారు. ఆలయ ద్వారాలు మూసిన అనంతరం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేనట్లు చెప్పారు.

సాయంత్రం తర్వాత అనుమతి…

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

ఆలయ మూసివేత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలియజేశారు.

  • ఇవాళ మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
  • తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను ఇవాళ ఉదయం 9 గంటలకు మూసివేశారు. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు.
  • తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేశారు. రాత్రి 7.30 తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు.
  • శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఉదయం 9 గంటలకు క్లోజ్ చేశారు. రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
  • తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ‌స్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యాల‌ను ఉదయం 9 గంటలకు మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe