...
...
Next Story

తిరుమల : ఈనెల 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. డిసెంబర్ 23న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఫలితంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి.

Published on: Dec 20, 2025, 09:42:01 IST
Advertisement

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలను కల్పించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దర్శనాలను పుర‌స్క‌రించుకుని డిసెంబర్ 23వ తేదీ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డిసెంబర్ 23వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో డిసెంబర్ 23న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. డిసెంబర్ 22వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

పకడ్బందీగా ఏర్పాట్లు:

  • గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టనున్నారు.
  • వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది.
  • టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలకు రావొచ్చు.
  • వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు.
  • వైకుంఠ ఏకాదశి ముందురోజు సాయంత్రం నుండి భక్తులకు అన్న పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్న ప్రసాద విభాగం అధికారులను ఆదేశించారు.
  • భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు అవసరమైన సంఖ్యలో శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచనున్నారు.
  • శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • టీటీడీ, పోలీసు అధికారులతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమస్యలపై తక్షణం స్పందించేలా సమన్వయంతో పని చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe