ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి విమానాశ్రయంలో ఫ్లైట్ టైమింగ్స్ ఛేంజ్!

Tirupati Flight Timings Change : తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసుల టైమింగ్స్ మారాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

Published on: Sep 1, 2026, 09:48:46 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట) ద్వారా ప్రయాణించే భక్తులు, ఇతర ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు కీలక విజ్ఞప్తి చేశారు. పలు ప్రముఖ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసుల వేళల్లో సవరణలు చేసినట్లు విమానాశ్రయ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నూతన టైమ్‌టేబుల్ సెప్టెంబరు 1, 2026 అమలులోకి వస్తుందని వెల్లడించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

తిరుపతి విమాన వేళల్లో మార్పులు
తిరుపతి విమాన వేళల్లో మార్పులు

ఇండిగో సర్వీసులు

ఇండిగో సంస్థకు చెందిన పలు సర్వీసుల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో మార్పులు జరిగాయి.

హైదరాబాద్ - తిరుపతి : ఉదయం 7:20 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి ఉదయం 8:00 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరుతుంది.

హైదరాబాద్ - తిరుపతి : ఉదయం 11:15 గంటలకు వచ్చి, తిరిగి 11:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.

హైదరాబాద్ - తిరుపతి : మధ్యాహ్నం 1:50 గంటలకు ల్యాండ్ అయి, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.

విశాఖపట్నం - తిరుపతి: మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి సాయంత్రం 4:00 గంటలకు వైజాగ్ వైపు బయలుదేరుతుంది.

ఢిల్లీ - తిరుపతి: సాయంత్రం 6:25 గంటలకు వచ్చి, తిరిగి రాత్రి 7:05 గంటలకు దేశ రాజధానికి తిరుగు ప్రయాణమవుతుంది.

హైదరాబాద్ - తిరుపతి : రాత్రి 8:20 గంటలకు తిరుపతి చేరుకుని, రాత్రి 9:00 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.

స్టార్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా సర్వీసులు

ఇండిగోతో పాటు స్టార్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా సంస్థల సర్వీసుల సమయాలు కూడా సవరించాయి.

స్టార్ ఎయిర్‌లైన్స్ (శివమొగ్గ - తిరుపతి - హైదరాబాద్): ఈ విమానం కర్ణాటకలోని శివమొగ్గ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్‌ మార్గంలో బయలుదేరుతుంది.

ఎయిర్ ఇండియా (హైదరాబాద్ - తిరుపతి): సాయంత్రం 5:10 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌కు ప్రయాణమవుతుంది.

విమాన సమయాల్లో మార్పులు జరిగిన దృష్ట్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. బోర్డింగ్ పాస్‌లు పొందడం, సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియల్లో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రయాణికులు విమాన సమయానికి కనీసం 2 గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని సూచించింది. సంబంధిత విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ప్రయాణానికి ముందే విమాన స్టేటస్‌ను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More