...
...
Next Story

ఆలయం సెట్‌ మాదిరిగా తిరుపతి ఎయిర్‌పోర్టు.. కరీంనగర్, దుబ్బాకలో శ్రీవారి ఆలయాలు!

తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయనున్నట్టుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయం సెట్ మాదిరిగానే తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఉండనుందని పేర్కొన్నారు.

Published on: Nov 5, 2025, 20:15:46 IST
Advertisement

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి.. ఏడాది అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల్లో భక్తి భావన పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని వివరించారు. ఎయిర్‌పోర్టును ఆలయం సెట్ మాదిరిగానే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

'భక్తులకు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నాం. రోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులు అన్న ప్రాసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కూడా మార్పులు వచ్చాయి. పది రోజులైనా నిల్వ ఉంటున్నాయి. ఈ విషయాన్ని భక్తులే చెబుతున్నారు. తిరుపతి లోకల్ వాళ్లకు నెలకోసారి తొలి మంగళవారం 3 వేల మందికి దర్శనం కల్పిస్తున్నాం.' అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.

ఏఐ సాంకేతికత సాయంతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం ఏర్పాటు చేయాలని అనుకున్నామన్నారు. కొందరు ఏపై గురించి వ్యతిరేకత వ్యక్తం చేశారని, కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో మళ్లీ ఏఐ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తామన్నారు. తిరుమల కొండపై రాజకీయలు మాట్లాడితే చర్యలు తీసుకోవాలని తీర్మానించామన్నారు.

తిరుమలలో దాదాపు 1500 దుకాణాలకు ఇష్టా రాజ్యంగా అనుమతులు ఇచ్చారని, వాటిని క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. బ్రేక్ దర్శనలు మెున్నటిదాకా 10.30కి ఉండేవని, ఇప్పుడు వాటిని తెల్లవారుజామునకు మార్చామన్నారు. అలిపిరి టోల్‌గేట్ వద్ద కొత్త సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామని కేంద్రమంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారని, వాటిని తిరుపతి, తిరుమల మధ్య నడిపేందుకు నిర్ణయించామన్నారు. టీటీడీ పరిధిలో ఉండే ఆలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks