...
...
Next Story

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు.. ఒక కిలో 80 రూపాయలు!

టమాటా ధరలు ఏపీలో సామాన్యూలకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా వేసి కూర వండాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది. భారీగా ధరలు పెరిగాయి.

Published on: Nov 25, 2025, 17:26:15 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా ధరలు బాగా పెరిగాయి. చిత్తూరు బెల్ట్‌లోని హోల్‌సేల్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్లలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా వాణిజ్య కేంద్రాలలో ఒకటైన మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో, మొదటి గ్రేడ్ టమోటాలు 10 కిలోలకు రూ.610 కు చేరుకోగా రెండో గ్రేడ్ టమోటాలు రూ.480కు అమ్ముడవుతున్నాయి. వారం క్రితం అదే రకాలు రూ.440, రూ.340కు అమ్ముడయ్యాయి.

టమాటా ధరలు
టమాటా ధరలు

మార్కెట్ రాకపోకలు కూడా 140 మెట్రిక్ టన్నులకు బాగా పడిపోయాయి. ఇది సాధారణ రాకపోకల కంటే చాలా తక్కువ అని అంటున్నారు. మెుంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో టమాటా పంట నష్టం జరిగింది. తుఫాను మెుంథాకు ముందు రూ.20 నుండి రూ.40 వరకు ఉన్న రిటైల్ ధరలు ఇప్పుడు కిలోకు రూ.65 నుండి రూ.80 వరకు పెరిగాయి.

తక్కువ సరఫరా ఉన్న ప్రాంతాల్లో ధరలు కిలోకు రూ.90 కూడా దాటాయి. తుపానుతో నిరంతర వర్షాలే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరులలో దాదాపు 10,000 హెక్టార్ల టమోటా పంటలు అధిక తేమ, కుళ్ళిపోవడం, తెగుళ్ల బారిన పడి దెబ్బతిన్నాయి. ఇక రాష్ట్రంలో భారీ ఎత్తున పంటన నష్టం జరిగింది.

నిజానికి రైతులు మంచి సీజన్ వస్తుందని ఆశించారు. కానీ దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగాయి. మార్కెట్‌కు టమోటాలు రావడం తగ్గడం, పండ్ల నాణ్యత తగ్గడం, ఇతర రాష్ట్రాల కొనుగోలుదారుల నుండి బలమైన డిమాండ్ ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. ఈ ధరల పెరుగుదల టమోటాలకే పరిమితం కాదు.

వర్షాభావం వల్ల పంట నష్టం, మార్కెట్లకు పంట రాకపోకలు తగ్గడం, సుదూర ప్రాంతాల నుండి సరఫరాలు పెరుగుతున్నందున రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఈ పెరుగుదల ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe