అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఉన్న అతిపెద్ద టమాటా మార్కెట్‌కు బుధవారం (సెప్టెంబర్ 30, 2026) సరకు రాక మరింత తగ్గడంతో రాయలసీమ జిల్లాల్లో టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 88 టన్నుల టమాటాలు మార్కెట్‌కు రాగా బుధవారం కేవలం 62 టన్నులు మాత్రమే వచ్చాయని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలిపింది.
పెరిగిన టమాటా ధర
{{^htLoading}} {{/htLoading}}
మొదటి రకం టమాటాలకు 10 కిలోలకు రూ.410 ధర పలకగా, రెండో రకానికి రూ.200 నుండి రూ.290 వరకు, చివరి రకానికి రూ.260 ధర నమోదైంది. సెప్టెంబర్ 29న మొదటి రకం టమాటాలు 10 కిలోలకు రూ.330కి, రెండో రకం రూ.250కి అమ్ముడయ్యాయి.
మదనపల్లె, కడప, తిరుపతి, కర్నూలు పరిసర ప్రాంతాల్లోని చిల్లర మార్కెట్లలో టమాటాలు కిలో రూ.45 నుండి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఏటా సుమారు రూ.350 కోట్ల వ్యాపారం జరిగే మదనపల్లె మార్కెట్ యార్డ్‌లో సాధారణంగా గరిష్ట సీజన్‌లో రోజుకు 900 నుండి 1,300 టన్నుల సరుకు వస్తుంటుంది. అయితే ప్రస్తుతం సాగు ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పండుగ సీజన్ కారణంగా కోతలు పెరగడం వంటి కారణాల వల్ల సరుకు రాక గణనీయంగా తగ్గింది.
ప్రతి వారం మదనపల్లె, పుంగనూరు నుండి తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వందల టన్నుల టమాటాలు రవాణా అవుతాయి. దసరా, దీపావళి, అయ్యప్ప దీక్షా కాలంలో ఇతర రాష్ట్రాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, సరుకు రాక పెరగకపోతే స్థానిక ధరలు కిలోకు రూ.50 లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
టమాటా మార్కెట్ ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండటం సహజం. ఒక్కోసారి టమాటా ధరలు ఆకాన్నంటుతాయి. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుంది. కొన్నిసార్లైతే అన్నదాతలు టమాటాలను రోడ్ల మీద పడేసి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి.
{{/usCountry}}
{{#usCountry}}
టమాటా మార్కెట్ ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండటం సహజం. ఒక్కోసారి టమాటా ధరలు ఆకాన్నంటుతాయి. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుంది. కొన్నిసార్లైతే అన్నదాతలు టమాటాలను రోడ్ల మీద పడేసి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి.
{{/usCountry}}
గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం ఉన్న ధర లాభదాయకంగానే ఉందని రైతులు పేర్కొన్నారు. అయితే కమిషన్, రవాణా, వృథా ఖర్చులు పోను, చిల్లర విక్రయ ధర అయిన రూ.50లో పూర్తి వాటా తమకు దక్కడం లేదని చెబుతున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.