విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలోని నలుగురు సూసైడ్

Visakhapatnam Crime News : విశాఖపట్నం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

Published on: Aug 29, 2026, 07:31:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విశాఖపట్నం జిల్లాలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆర్థిక సమస్యలు లేదా మరేవైనా మనస్పర్థలో తెలియదు గానీ, కన్నవారి చేతులతోనే కన్నబిడ్డల ప్రాణాలు తీసి, ఆపై దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన పెందుర్తి మండలం పరిధిలోని చింతలగ్రహారం కాలనీలో చోటు చేసుకుంది.

విశాఖపట్నం క్రైమ్
విశాఖపట్నం క్రైమ్

స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చింతలగ్రహారం కాలనీలో నివసిస్తున్న మల్లా వినోద్‌కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. వినోద్‌కుమార్ మొదట తన భార్యకు, ఇద్దరు కుమార్తెలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ప్రాణాలు విడిచారని నిర్ధారించుకున్న అనంతరం, అతను కూడా విషం తాగి లేదా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలినట్లు భావిస్తున్నారు. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెంది పడి ఉండటంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇంట్లో నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇల్లును పరిశీలించారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో చింతలగ్రహారంలో శోకసంద్రం అలుముకుంది. అసలు వీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణాలు ఏంటి? అప్పుల బాధలా, కుటుంబ కలహాలా లేక అనారోగ్య సమస్యలా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మృతుల మొబైల్ ఫోన్లు, ఇంట్లో దొరికిన ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల సమగ్ర దర్యాప్తు అనంతరమే ఈ ఘోర కలికలానికి సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి.

నెల్లూరులో యువకుడి ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తనను ప్రియురాలు మోసం చేసిందని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో తీసి.. సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలానికి చెందిన శివకుమార్, ఓ యువతి మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతి.. వేరే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతూ వెళ్లిపోయింది. దీంతో శివ మనస్తాపానికి గురయ్యాడు.

తనను ప్రేమించిన యువతి మోసం చేసిందని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని శివకుమార్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్ దగ్గర శివ తల్లిదండ్రులు, బంధువులు మిత్రులు ధర్నా చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More