రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి ట్రైనింగ్ ప్రక్రియ మొదలుకాబోతుంది. మంగళవారం ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపి కబురు చెప్పారు.
స్టైఫండ్ పెంపుపై సీఎం ప్రకటన…

శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500 కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి వేదికపైనే ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.4500 నుంచి వారికి స్టైఫండ్ ను ఒక్కసారిగా రూ.12,500 కు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ట్రైనీ కానిస్టేబుళ్లు కేరింతలు కొట్టారు.
పోలీసు శాఖలో ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరందరికీ ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
అప్రమత్తంగా ఉండాలి - సీఎం చంద్రబాబు
విజిబుల్ పోలీసింగ్- ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానమే ఇప్పుడు అవసరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పీపీపీ విధానాన్ని పోలిసింగ్ లో అనుసరించాలని సూచంచారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలన్నారు.
“నాలుగేళ్లుగా ఎదురు చూసిన వారికి కూటమి వచ్చాక కోర్టు కేసులు పరిష్కరించి ఇప్పుడు నియాకమపత్రాలను అందించాం. శిక్షణ పూర్తి అవుతూనే పోలీసు కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరతారు. గతంతో కలిపి మొత్తం 23,676 ఉద్యోగాలు నేను సీఎంగా ఉన్న సమయంలోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం 75 వేల మంది పోలీసు బలగాల్లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది కూడా మేమే ఉద్యోగం ఇవ్వటమే మా లక్ష్యమని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం” అని చెప్పుకొచ్చారు.
{{/usCountry}}“నాలుగేళ్లుగా ఎదురు చూసిన వారికి కూటమి వచ్చాక కోర్టు కేసులు పరిష్కరించి ఇప్పుడు నియాకమపత్రాలను అందించాం. శిక్షణ పూర్తి అవుతూనే పోలీసు కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరతారు. గతంతో కలిపి మొత్తం 23,676 ఉద్యోగాలు నేను సీఎంగా ఉన్న సమయంలోనే పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం 75 వేల మంది పోలీసు బలగాల్లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది కూడా మేమే ఉద్యోగం ఇవ్వటమే మా లక్ష్యమని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం” అని చెప్పుకొచ్చారు.
{{/usCountry}}