ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ల మధ్య కొత్త హై-స్పీడ్ రైలు మార్గం ద్వారా ప్రయాణ సమయం 70 నిమిషాలగా ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎర్రపాలెం నుండి నంబూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం, కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతెన నిర్మాణం ఉంటాయన్నారు.

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ప్రతిపాదిత హై-స్పీడ్ నెట్‌వర్క్ అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబైలను కలుపుతుందని అన్నారు. హైదరాబాద్ నుండి పూణేకు గంటా 55 నిమిషాలు, పూణే నుండి ముంబైకి 48 నిమిషాలు, చెన్నై నుండి బెంగళూరుకు 73 నిమిషాలు, హైదరాబాద్ నుండి బెంగళూరుకు సుమారు రెండు గంటల ఎనిమిది నిమిషాలు, అమరావతి నుండి చెన్నైకి 112 నిమిషాలు పడుతుందని ఆయన తెలిపారు.
'బుల్లెట్ రైలు, మనందరి కలల ప్రాజెక్ట్. మీకు తెలిసినట్లుగా, అహ్మదాబాద్ నుండి ముంబై బుల్లెట్ రైలు పురోగతికి సంబంధించిన వీడియోలను మీరు చూసి ఉంటే, ఆ 500 కిలోమీటర్ల మార్గం ఒక గంట 57 నిమిషాల్లో పూర్తవుతుంది. కాబట్టి ప్రాథమికంగా ముంబై, సూరత్, వాపి, బరోడా, అహ్మదాబాద్ వంటి ఈ పెద్ద నగరాలన్నీ ఒకే ఎకనామిక్ జోన్‌గా, ఒకే ఆర్థిక ప్రాంతంగా మారతాయి. అదే అద్భుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతుంది, అమరావతి నుండి హైదరాబాద్ 70 నిమిషాల్లో చేరుకుంటారు.' అని కేంద్రమంత్రి అన్నారు.
ఇలాంటి అనుసంధానం, దక్షిణ రాష్ట్రాల వ్యాప్తంగా ఒక "హై-స్పీడ్ డైమండ్"ను సృష్టిస్తుందని చెప్పారు. తూర్పు తీర మార్గాన్ని మొత్తం నాలుగు రైల్వే లైన్లుగా ఉన్నతీకరిస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సుమారు రూ.9,889 కోట్ల వ్యయంతో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఇటీవల ఆమోదించిన మూడో, నాల్గో లైన్లతో కూడిన ఈ క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్, తీరప్రాంత కారిడార్‌ను సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. కోల్‌కతా నుండి చెన్నై వరకు ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్లను నాలుగు లైన్లకు ఉన్నతీకరించడం ద్వారా సుమారు 500 కొత్త సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్లను నడపడానికి వీలవుతుందని, అలాగే ఓడరేవులు, పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలకు మెరుగైన ప్రవేశ సౌలభ్యం కలుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
{{/usCountry}}ఇలాంటి అనుసంధానం, దక్షిణ రాష్ట్రాల వ్యాప్తంగా ఒక "హై-స్పీడ్ డైమండ్"ను సృష్టిస్తుందని చెప్పారు. తూర్పు తీర మార్గాన్ని మొత్తం నాలుగు రైల్వే లైన్లుగా ఉన్నతీకరిస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సుమారు రూ.9,889 కోట్ల వ్యయంతో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఇటీవల ఆమోదించిన మూడో, నాల్గో లైన్లతో కూడిన ఈ క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్, తీరప్రాంత కారిడార్‌ను సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. కోల్‌కతా నుండి చెన్నై వరకు ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్లను నాలుగు లైన్లకు ఉన్నతీకరించడం ద్వారా సుమారు 500 కొత్త సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్లను నడపడానికి వీలవుతుందని, అలాగే ఓడరేవులు, పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలకు మెరుగైన ప్రవేశ సౌలభ్యం కలుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ గురించి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి గతంలో రూ.886 కోట్ల కేటాయింపు ఉండగా, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.10,134 కోట్లు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.1.06 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా 74 రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారని చెప్పారు.
డేటా సెంటర్లను నిర్మించే కంపెనీలతో సహా పలు కంపెనీలు సర్వర్లను భారతదేశంలోనే తయారు చేయాలని వైష్ణవ్ కోరారు. విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇండియాఏఐ మిషన్ కింద సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్ ఆపరేటర్లు నీటి వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఇంధన సామర్థ్యం, రీసైక్లింగ్, మురుగునీటి పునర్వినియోగంపై చేసే పనులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు.