తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఏ తేదీన ఏం ఉన్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు.
- డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.
- డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
- డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.
- డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.
- డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.
- డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.
- డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.
వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.
నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందిస్తారు.
వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
{{/usCountry}}వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
{{/usCountry}}