పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఇంజినీరింగ్ పనులు పూర్తయ్యాయి. తిరుచానూరుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా టిటిడి భద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి.విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 900, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

భక్తుల సౌకర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్‌లో 50, ఎస్వీ హైస్కూల్ వద్ద -15, శ్రీ అయప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్రి)ఆలయం వద్ద – 45, పూడి ఏరియాలో – 25., గేట్ – 4లో ఎమర్జెన్సీ – 15 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు.
ఇందులో భాగంగా 284 శాశ్వత, తాత్కాలికం, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
వైద్య, పారా మెడికల్ సిబ్బంది, 3 ప్రాంతాలలో ప్రథమచికిత్స కేంద్రాలు, 5 అంబులెన్స్‌లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్, రుయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలందిస్తారు. అదేవిధంగా ఫైర్, జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
చంద్రప్రభ వాహనంపై అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
{{/usCountry}}తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
{{/usCountry}}క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయని భక్తుల నమ్మకం.