...
...
Next Story

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు, మరింత ఆకర్షణీయంగా సూచిక బోర్డులు - ఈవో ఆదేశాలు

పలు రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉచిత బస్సులను కూడా పెంచాలన్నారు.

Published on: Nov 16, 2025, 08:25:09 IST
Advertisement

తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దనుంది. ఈ మేరకు పలు అంశాలపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఉచిత బస్సులు పెంచాలి - ఈవో

టీటీడీ ఈవో సమీక్ష
టీటీడీ ఈవో సమీక్ష

టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. తిరుమలలో భక్తులు వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సులను పెంచాలని సూచించారు. తిరుమలలో ఘన వ్యర్థా పదార్థాలను వేగంగా తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.

టీటీడీ ఆలయాలలో ఉత్సవాల సమయాలలో ఆలయాల సుందరీకరణలో భాగంగా గార్డెన్ విభాగం, ఎలక్ట్రికల్ విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృంధాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా కళాప్రదర్శనలు ఇచ్చిన నేపథ్యంలో కళా బృందాలను అభినందిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తరాలు రాయాలని, సంబంధిత కళాబృందాల పోటోలను పంపాలని సూచించారు.

అప్పలయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులువుగా గుర్తించి వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే వినాయక నగర్ క్వార్టర్స్ లలో పెయింటిగ్స్, క్లీనింగ్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని… ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు . దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి భూముల మాస్టర్ డేటాబేస్ ను ఏర్పాటు చేయాలని, కల్యాణ మండపాల నిర్వహణపై నివేదిక తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

భూసేకరణపై ఉత్తరాలు రాయండి…

తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి శ్రీవారి మెట్టుకు భక్తుల వెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు భక్తుల నుండి అధిక ధరలు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఈవో ప్రస్తావించారు. దీనిపై చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట, అమరావతి, తిరుచానూరు ఆలయాల మాస్టర్ ప్లాన్ లపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఆలయాలలో లైటింగ్, గ్రిల్స్, తదితర అంశాలపై ఆర్కిటెక్ అధికారుల సూచనలు తీసుకోవాలని సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks