తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది సెప్టంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది.

సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకోవడంలో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సెప్టెంబరులో విశేష ఉత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబరు 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
{{/usCountry}}శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
{{/usCountry}}శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో సెప్టెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సుందరరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సెప్టెంబరు 13న హస్తా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో సెప్టెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.