బర్డ్ ఆసుపత్రిలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకానికి టీటీడీ నిర్ణయం
తిరుమలలో జరిగిన బర్డ్ ట్రస్ట్, హెచ్ డీపీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఇందులో భాగంగా టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన బర్డ్ ఆసుపత్రి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలోని కొన్ని ముఖ్యాంశాలు
- బర్డ్ ఆసుపత్రిలో ఆర్థో, ఇన్ పేషంట్ సేవలను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మరింత మంది డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకం.
- భద్రత, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
- డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కలిగి ఉండి, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులలో ఏటా 100-150 మంది రోగులకు అయ్యే పూర్తి ఖర్చును భరించడానికి ముందుకు వచ్చిన చెన్నైకి చెందిన గువీ హెల్త్ కేర్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవడం.
అంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు పలు అంశాలపై చర్చించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్, సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు జానకి దేవి, నరేష్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా.జగదీశ్, హెచ్‌డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డూ కౌంటర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై శ్రీవారి ఆలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దర్శన క్యూలైన్లలో ఎలాంటి అసౌకర్యానికి తావు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని భక్తులు ఛైర్మన్ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం లడ్డూ కౌంటర్ వద్దకు చేరుకున్న ఛైర్మన్ లడ్డూ విక్రయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని, కావాల్సినన్ని లడ్డూలు దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రోజుకు 4.80 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నట్లు ఛైర్మన్‌కు వివరించారు. అన్ని కౌంటర్లు తెరిచి ఉంచి ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు లడ్డూలు విక్రయించాలని అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


