హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు!

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదైంది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై కొన్ని రోజులుగా అతడిపై విమర్శలు వస్తున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Published on: Dec 31, 2025, 22:09:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై రెండో చోట్ల కేసులు నమోదు అయ్యాయి. హిందూ దేవతలుగా పూజించే సీతాదేవి, ద్రౌపదీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్‌ను నడిపిస్తున్న యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు అతడిపై ఫిర్యాదు చేశారు.

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు (X)
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు (X)

విశాఖపట్టణానికి చెందిన యూట్యూబర్ అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. హిందూవులు పూజించే సీతాదేవి, ద్రౌపదీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టుగా ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్ వెల్లడించారు. ఇక తెలుగు నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అన్వేష్‌పై కేసు నమోదైంది.

గత కొన్ని రోజులుగా యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాడు. కొన్ని రోజుల కిందట మహిళలు బయట ఈవెంట్లకు వచ్చినప్పుడు నిండుగా రావాలని, ఇబ్బందులు పడకూడదని నటుడు శివాజీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి అనసూయ స్పందించారు. తర్వాత ఈ విషయం పెద్దదైంది. తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అయింది. కొందరు శివాజీకి మద్దతుగా ఉంటే.. మరికొందరు అనసూయ చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ చేశారు.

ఈ వివాదంలోకి యూట్యూబర్ అన్వేష్ కూడా వచ్చాడు. శివాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు మహిళల బట్టల గురించి మాట్లాడినందుకు ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుపై కూడా తీవ్రస్థాయిలో మాటలు అన్నాడు అన్వేష్. ఈ సందర్భంలోనే సీతాదేవి, ద్రౌపదిలపై కూడా వ్యాఖ్యానించాడు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

చివరకు అన్వేష్ సోషల్ మీడియాలో జనాలు అన్‌ఫాలో చేయడం మెుదలుపెట్టారు. అతడికి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్‌ నడిచింది. చాలా మంది ఫాలోవర్లు కూడా అన్‌ఫాలో చేశారు. తన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులు, విమర్శలకు అన్వేష్ స్పందించాడు. శివాజీ, గరికపాటికి క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన కామెంట్స్‌పై సారీ చెప్పాడు. అయితే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని శపిస్తూ వీడియోను విడుదల చేశాడు. అతని నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను చేసింది తప్పైతే రాత్రి రాత్రే రక్తం కక్కుకుని చాస్తా అంటూ చెప్పాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందుల్లో పడతారని పేర్కొన్నాడు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More