ఇండియా చీఫ్ మినిస్టర్ విజయ్.. దళపతిపై దారుణమైన ట్రోల్స్.. ఫేమస్ యూట్యూబర్ లైవ్ లో పరువు తీసిన ఫ్యాన్స్

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇండియా చీఫ్ మినిస్టర్ అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా మాట్లాడటమే ఇందుకు కారణం. థాయ్‌లాండ్‌లో యూట్యూబర్ స్పీడ్ లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా, కొందరు విజయ్ అభిమానులు తమిళ సూపర్ స్టార్‌పై తమ ప్రేమను పంచుకున్నారు.

Published on: Oct 23, 2025, 08:43:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆయన ప్రమేయం లేకుండానే, ఏం చేయకుండానే దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం ఫేమస్ యూబ్యూటర్ ఐషోస్పీడ్ (IShowSpeed)గా పిలిచే యూట్యూబర్ స్పీడ్ లైవ్ స్ట్రీమింగ్ లో ఇద్దరు ఫ్యాన్స్ కామెంట్లు చేయడమే. దీంతో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది.

విజయ్ పై ట్రోల్స్
విజయ్ పై ట్రోల్స్

దళపతి విజయ్

ఇటీవల థాయ్‌లాండ్‌ పర్యటనలో స్పీడ్ లైవ్-స్ట్రీమింగ్ చేస్తుండగా తమిళ స్టార్ విజయ్ అభిమానులు ఇద్దరు ఉన్నట్టుండి అతనిపై అరవడంతో గందరగోళానికి గురయ్యాడు. 'టీవీకే', 'దళపతి విజయ్' అని అరుస్తుండటంతో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ నిజంగా అయోమయంలో పడిపోయాడు. స్పీడ్ కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు భారతీయులు టూ-వీలర్‌పై వెళ్లడం కనిపించింది. అకస్మాత్తుగా వారు దాటి వెళ్తూ అతనిపై “టీవీకే, టీవీకే” అని అరవడం ప్రారంభించారు.

సౌత్ ఇండియన్ యాక్టర్

కన్ ఫ్యూజన్ కు గురైన స్పీడ్ వాళ్లను దేని గురించి మాట్లాడుతున్నారని అడిగాడు. వారు “విజయ్, తళపతి విజయ్” అని చెప్పారు. దీంతో అతను మరింత గందరగోళానికి గురై “ఏంటి? వాళ్లేం మాట్లాడుతున్నారు?” అని అన్నాడు. వాళ్ళు చెప్పినదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, దాన్ని పలకడానికి కూడా ప్రయత్నించాడు. ఆ తర్వాత “ఈ రోజు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. వాళ్ళు తన పక్కకు వచ్చినప్పుడు మళ్లీ వివరించమని ఓపికగా అడిగాడు. కానీ వాళ్ళు “విజయ్, విజయ్, సౌత్ ఇండియన్ యాక్టర్” అని చెప్పడంతో అర్థం చేసుకోలేకపోయాడు.

చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా

ఆ అభిమానులు ఫన్నీగా విజయ్ ను 'చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' అని కూడా ప్రస్తావించారు. స్పీడ్ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, వారు యూట్యూబర్‌ను తమతో బైక్ రైడ్‌కు రావాలని పట్టుబట్టారు, కానీ అతను నిరాకరించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజయ్ అనే ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాలకు చీఫ్ మినిస్టర్లు ఉంటారు కానీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ మాత్రమే ఉంటారు. అలాంటిది విజయ్ ను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పిలవడం వైరల్ గా మారింది.

ఇంటర్నెట్ రియాక్షన్

అభిమానుల ప్రవర్తనపై ఇంటర్నెట్‌లో నెటిజన్లు సరదాగా స్పందించారు. ఒక X (గతంలో ట్విట్టర్) యూజర్ “చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా?” అని రాశారు. మరొకరు “నటుడు విజయ్ మరోసారి అంతర్జాతీయ ట్రోల్ మెటీరియల్ అయ్యారు” అని రాశారు. అయితే కొందరు అభిమానులు స్పీడ్ ఒకప్పుడు 'లియో' సినిమా చూసి విజయ్‌ను ప్రశంసించాడని గుర్తుచేశారు. వారిలో ఒకరు “ఇదే స్పీడ్ ఒకప్పుడు తళపతి విజయ్ గురించి ‘చాద్ ఈజ్ ది ఇండియన్ జాన్ విక్’ అని అన్నాడు!” అని రాశారు.

జన నాయగన్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన 'ది గోట్' (The GOAT) చిత్రంలో చివరిసారిగా ద్విపాత్రాభినయంలో కనిపించారు విజయ్. తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో పొంగల్ విడుదలకు సిద్ధమవుతున్న 'జన నాయగన్' (Jana Nayagan) చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులు నటిస్తున్నారు. ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంటరైన్ విజయ్ కు ఇదే చివరి సినిమా అనే ప్రచారం జరుగుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More