...
...
Next Story

తిరుమల : లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు - భక్తుల కోసం QR కోడ్ ఆధారిత సేవలు

తిరుమలలోలగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. పాద రక్షలు నిర్వహణకు QR కోడ్ ఆధారిత సేవలు పొందవచ్చు. ఫలితంగా భక్తులకు పాద రక్షల ఇబ్బందులు ఉండవని టీటీడీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

Published on: Jan 14, 2026, 05:10:49 IST
Advertisement

తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన QR కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్ ను ప్రారంభించారు.

8 కౌంటర్లు ఏర్పాటు - టీటీడీ అదనపు ఈవో

తిరుమలలోలగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు
తిరుమలలోలగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు

ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ…. తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ QR కోడ్ ఆధారిత ఆధునిక పాద రక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో… తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

క్యూఆర్ కోడ్ స్లిప్స్….

ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి QR కోడ్‌తో కూడిన స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌లో పాద రక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయి. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్‌ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న ఖచ్చితమైన స్థానం డిస్‌ప్లే అవుతుంది. తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈవో తెలిపారు.

ఈ సందర్భంగా భక్తులు తమ పాద రక్షలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండా, నిర్దేశిత కౌంటర్లలోనే డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తిరుమల పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks