టీటీడీ : ఇక తిరుమలలోని సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు.. డిసెంబర్‌లోనే అందుబాటులోకి ఏఐ చాట్‌బాట్
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. టీటీడీ ఏఐ చాట్‌బాట్‌ను మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా మీరు సమాచారాన్ని ఈజీగా, 13 భాషల్లో తెలుసుకోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు తిరుమల పుణ్యక్షేత్రం, వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సహకారంతో డిసెంబర్ లోనే అంటే రాబోయే 15 రోజుల్లో ఏఐ-ఆధారిత చాట్‌బాట్ భక్తులకు అందుబాటులోకి వస్తుంది.

ఈ చాట్‌బాట్ భాష అడ్డంకులను లేకుండా చేస్తుంది. వారి సందేహాలకు సంబంధించి వెంటవెంటనే సమాధానం ఇస్తుంది. దీంతో టీటీడీ అధికారుల నుండి సమాధానం కోసం భక్తులు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తిరుమలకు సంబంధించి మీకు కావాల్సిన సమాచారం మీరు మీ చేతుల్లోనే పొందవచ్చు.
దర్శన టిక్కెట్లు, వసతి సౌకర్యాలు, రవాణా, తిరుగు ప్రయాణం గురించి తమ సందేహాలను తీర్చుకోవడానికి భక్తులు టీటీడీ కాల్ సెంటర్లు, ఈమెయిల్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను సంప్రదిస్తారు. అయితే మానవ వనరుల కొరత కారణంగా సమాధానం ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏఐ చాట్‌బాట్ ఈ సమస్యను అధిగమించి 24 గంటలూ సమాధానాలను అందిస్తూనే ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఏఐ చాట్‌బాట్ ఒకేసారి అనేక మంది భక్తుల సందేహాలను నివృత్తి చేయగలదు. ఇది 13 భారతీయ భాషలలోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఇది దర్శన టికెట్ బుకింగ్‌కు సంబంధించి యాత్రికులకు మార్గనిర్దేశం చేస్తుంది. వారికి రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది సాధారణ టైపింగ్‌తో పాటు స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్లను కూడా అందిస్తుంది.
స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. డిసెంబర్ 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ-డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది.
తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


