తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు వస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టీటీడీ ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది.
పెరటాసి మాసంతో పాటు వరుస సెలవులు నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1,2, నారాయణగిరి షెడ్లు, అక్టోపస్ సర్కిల్ వరకు బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో అనునిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. సుమారు 18 గంటల దర్శన సమయం పడుతోంది.

స్లాటెడ్ సర్వదర్శన భక్తులు దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం దర్శనం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అక్టోబర్ 1, 5వ తేదీల్లో దేవస్థానం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు.
అన్న ప్రసాదం విభాగం, ఆరోగ్య విభాగం, శ్రీవారి సేవా విభాగం, విజిలెన్స్ సిబ్బంది క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లలో మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. అదేవిధంగా చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు.
కాగా శ్రీవారి సేవకులు భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను భక్తులకు నిరంతరాయంగా అందిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. అన్న ప్రసాద విభాగం సిబ్బంది అన్న ప్రసాదాలను ఎప్పటికప్పుడు వాహనాల్లో క్యూలైన్ల వద్దకు తరిలించడం జరుగుతోంది.
టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా వైద్య విభాగం ఆధ్వర్యంలో మొబైల్ క్లీనిక్ నిరంతరాయంగా తిరుగుతూ అవసరమైన భక్తులకు వైద్య సహాయం అందించడం జరుగుతోంది.
ఇదివరకే భక్తుల అధిక రద్దీని దృషిలో ఉంచుకుని ఎక్కువ మంది సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అక్టోబర్ 1వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన విషయం విదితమే. టీటీడీ అధికారులు, సిబ్బంది, దర్శన క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రమిస్తున్నారు.
అక్టోబర్‌లో తిరుమలలో విశేష పర్వదినాలు
అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
అక్టోబర్ 12న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
అక్టోబర్ 16న శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ
అక్టోబర్ 20న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృథం, శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర.
అక్టోబర్ 21న బూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


