...
...
Next Story

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - విద్యుత్ కాంతులతో సుందర శోభ

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా, నగరాన్ని దివ్యమైన విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది.

Published on: Oct 10, 2026, 11:06:44 IST
Advertisement

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక తిరుపతి నగరాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు సిద్ధం చేయనుంది.

విద్యుత్ కాంతుల్లో తిరుపతి
విద్యుత్ కాంతుల్లో తిరుపతి

వరుస సెలవుల కారణంగా ఈసారి తిరుపతికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.

17 సర్కిళ్లు, 14 ప్రధాన రహదారులకు విద్యుత్ కాంతులు

తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, పరిపాలనా భవనాలతో పాటు నగరంలోని 17 కీలక సర్కిళ్లు, 14 ప్రధాన రహదారులు, 20 స్వాగత తోరణాలు (ఆర్చ్‌లు) మరియు 8 ప్రధాన పార్కింగ్ ప్రాంతాల్లో ఆకట్టుకునేలా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేయాలని జేఈఓ ఆదేశించారు. ముఖ్యంగా గరుడ సర్కిల్, నంది సర్కిల్ వంటి ప్రధాన కూడళ్లతో పాటు తిరుపతి నుంచి అలిపిరి వైపు వెళ్లే రహదారులను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. టీటీడీ పరిపాలనా భవనం, శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం విశ్రాంతి గృహాలు, లగేజ్ కౌంటర్ల వద్ద ప్రత్యేక అలంకరణలు రూపుదిద్దుకోనున్నాయి.

పార్కింగ్ స్థలాల్లో ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడీ బోర్డులు…

ప్రధాన ప్రాంతాల్లో భక్తి భావాన్ని పెంపొందించే ఎల్‌ఈడీ తోరణాలు, ఆకర్షణీయమైన డిజైన్లు, రంగురంగుల డిజిటల్ బోర్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాహన చోదకులకు వీలుగా పార్కింగ్ ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు నిరంతరం సమాచారాన్ని అందిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు మరియు సమాచారం కోసం ఎల్‌ఈడీ బోర్డులను వినియోగిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks