...
...
Next Story

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఆ టెండర్ నిబంధనల్లో మార్పులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహణలో ఉన్న మూడు ప్రధాన ఆసుపత్రులకు వైద్య సామాగ్రి కొనుగోలుకు సంబంధించి టెండర్లలో కీలక మార్పులు చేసింది. టెండర్లలో పాల్గొనే సంస్థల అర్హత ప్రమాణాలను సడలిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Published on: Aug 2, 2026, 22:25:55 IST
Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని ప్రముఖ ఆసుపత్రులకు మెడిసిన్, వైద్య పరికరాలు, ఇతర సరుకులను సరఫరా చేసే సంస్థలకు టీటీడీ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టెండర్లలో పాల్గొనే కంపెనీలకు నిర్దేశించిన కనీస వార్షిక విక్రయాల నిబంధనను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల వేలంలో పాల్గొనే సంస్థల సంఖ్య తగ్గిపోతోందని భావించిన పాలకమండలి, జూలై 14న జరిగిన సమావేశంలో ‘రిజల్యూషన్ నంబర్ 134’ ద్వారా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

తిరుపతిలోని టీటీడీ నిర్వహించే మూడు ప్రధాన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు కావలసిన మందులు, ఇంజెక్షన్లు, ల్యాబ్ పరికరాలు, సర్జికల్ వస్తువులు, రేడియాలజీ విభాగం సామాగ్రి, బ్లడ్ బ్యాంక్ ఉత్పత్తులు, ఇతర వైద్య సరకుల కొనుగోలుకు ఈ కొత్త సడలింపులు వర్తిస్తాయి.

బర్డ్ (BIRRD) - బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ది డిజేబుల్డ్

స్విమ్స్ (SVIMS) - శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ (SPCHC)

గతంలో ఉన్న టెండర్ నిబంధనల ప్రకారం ఔషధ తయారీదారులు, పంపిణీదారులు, దిగుమతిదారులు పాల్గొనాలంటే వార్షిక టర్నోవర్ కనీసం రూ. 100 కోట్లు ఉండాలనే నిబంధన ఉండేది. టర్నోవర్ పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల అర్హత కలిగిన అనేక కంపెనీలు టెండర్లలో పాల్గొనలేకపోయేవి. దీనివల్ల పోటీ తగ్గి, కొనుగోలు ప్రక్రియ మందగించేది.

ఏదేని కారణం వల్ల అత్యల్ప ధర కోట్ చేసిన ఎల్1 (L1) బిడ్డర్ మందులు సరఫరా చేయడంలో విఫలమైతే... ఎల్1 నిర్దేశించిన ధరలకే సరుకులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఎల్2 (L2), ఎల్3 (L3) బిడ్డర్ల నుంచి కొనుగోలు చేసే 'మల్టీ-వెండర్' విధానాన్ని కొనసాగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

ఆసుపత్రులలోకి మందులు, సర్జికల్ వస్తువులను స్వీకరించే ముందు వాటి నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ప్రతీ ఆసుపత్రిలోనూ ఒక "క్వాలిటీ అసెస్మెంట్ కమిటీ" ని ఏర్పాటు చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe