తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. వాహన సేవలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి

Tirumala Pournami Garuda Seva : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ జరిగింది. ఈ వాహన సేవలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు.

Published on: Oct 26, 2026, 21:07:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తిరుమలలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

పౌర్ణమి గరుడసేవ
పౌర్ణమి గరుడసేవ

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ పాల్గొన్నారు. పౌర్ణమి గరుడ సేవలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా ఉన్నారు.

కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. న‌వంబరు 10వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.

న‌వంబరు 11వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, న‌వంబరు 12 నుండి 13వ‌ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, న‌వంబరు 14న ధ‌ర్మశాస్త్ర హోమం, న‌వంబరు 15న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.

అదేవిధంగా న‌వంబరు 16న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, న‌వంబరు 17న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, న‌వంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), న‌వంబరు 27 నుంచి డిసెంబ‌రు 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), డిసెంబ‌రు 8న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా న‌వంబరు 15న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, డిసెంబరు 7న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500 చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More