తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం - హనుమంత వాహనంపై కోదండరాముడిగా శ్రీ మలయప్ప!
Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనంపై దర్శనమివ్వనున్నారు.
Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణాలు ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తజనుల గోవింద నామస్మరణలతో మాడ వీధులు మారుమోగిపోయాయి.

వాహనసేవ ముందర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు, జానపద నృత్యాలతో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల దివ్య మంగళ ధ్వనుల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. మాడ వీధుల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తారకమంత్ర స్మరణ చేశారు.
భగవద్భక్తికి ప్రతీక – హనుమంత వాహనం
శ్రీవారి వాహనసేవల్లో హనుమంత వాహనానికి విశిష్టమైన స్థానం ఉంది. భగవద్భక్తులలో అగ్రగణ్యుడైన ఆంజనేయుడు శ్రీరామునిపై అచంచలమైన భక్తిప్రపత్తులకు నిదర్శనం. చతుర్వేద పండితుడు, అపార పరాక్రమశాలి అయిన ఆంజనేయుడిపై శ్రీ మలయప్పస్వామివారు విహరిస్తూ భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని అందించారు. గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుడి మధ్య ఉన్న దివ్య బంధాన్ని ఈ వాహనసేవ భక్తులకు స్మరింపజేస్తుంది.
ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు అరుదైన పుష్పక విమానంపై వేడుకగా విహరించనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు రాజసానికి ప్రతీక అయిన గజవాహనంపై స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఉదయపు వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

