విజయ ఏకాదశి వ్రత కథ: శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి వ్రతం, ఈ వ్రత కథ చదివినా పుణ్యమే!
విజయ ఏకాదశి ఫిబ్రవరి 13న, అనగా ఈరోజు వచ్చింది. సనాతన ధర్మం ప్రకారం 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. ఏకాదశి తిథి ఎప్పుడూ కూడా శుభప్రదమైనది. ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. రామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథను చదువుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది.
ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని విజయ ఏకాదశి (Vijaya Ekadashi 2026) అని అంటారు. విజయ ఏకాదశి ఫిబ్రవరి 13న, అనగా ఈరోజు వచ్చింది. సనాతన ధర్మం ప్రకారం 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. అధిక మాసం వస్తే మరో రెండు ఏకాదశులు ఎక్కువవుతాయి. ఏకాదశి తిథి ఎప్పుడూ కూడా శుభప్రదమైనది.

విజయ ఏకాదశి
ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది వచ్చే విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విజయాలను అందుకోవచ్చు. విజయ ఏకాదశి నాడు రాముడు ఉపవాసం ఉండి విజయాన్ని పొందినట్లు తెలుస్తోంది. మరి ఏకాదశి వ్రత కథ కూడా తెలుసుకుందాం.
విజయ ఏకాదశి వ్రత కథ:
రామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథను చదువుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి విజయ ఏకాదశి నాడు విష్ణువును పూజించే ఈ ఏకాదశి వ్రత కథను కూడా చదువుకోండి. రావణుడి చెరలో ఉన్న సీతను విడిపించడానికి రాముడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు. వానర సైన్యం ఆ సముద్రాన్ని దాటి లంకకు ఎలా చేరుకోవాలి అని ఆలోచనలో ఉంది. అప్పుడు లక్ష్మణుడు అక్కడ సమీపంలో ఉన్న బకదళభ్యుడు అనే ఋషి దగ్గరకు వెళ్దామని చెప్పాడు. అక్కడికి వెళ్లి నివసిస్తున్న ఋషి సలహా అడుగుదామని రాముడితో చెప్పాడు.
ఋషి సలహా
అప్పుడు రాముడు అంగీకరించి ఆ ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. ఋషి రాముడిని చూడగానే ఆయన విష్ణువు అవతారమని తెలుసుకుంటాడు. అయినప్పటికీ రావణుడిని జయించి విజయం కలగాలంటే విజయ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే విజయం కలుగుతుందని సూచించాడు.
విజయం
అప్పుడు రాముడు విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. తర్వాత సేతువును నిర్మించి, వానరులతో పాటు లంకకు చేరుకుని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. విజయ ఏకాదశి నాడు ఈ వ్రతం ఆచరించడం వలన విజయం కలుగుతుందని అంటారు.
వ్రత గొప్పతనం:
ఈ వ్రత గొప్పతనం గురించి స్కాంద పురాణం, రామాయణంలో కూడా చెప్పబడింది. ఈ ఏకాదశి నాడు ఉపవాస నియమాలను పాటించినా, పాటించకపోయినా ఈ వ్రత కథను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. విజయం కలుగుతుంది. ఈ ఏకాదశి నాడు “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రాన్ని, విష్ణు సహస్రం పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


