తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్‌డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణ టోకెన్లతో పాటు గదుల కోటాకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు దశలవారీగా ఈ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
నవంబర్ 18న లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ :

శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్ల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానంలో కేటాయిస్తారు. ఇందుకోసం భక్తులు నవంబర్ 18 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాలి.
- ఈనెల 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
- వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు : అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
- శ్రీవాణి దర్శన కోటా విడుదల : శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
- వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల : ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- తిరుమల, తిరుపతిలలో గదుల కోటా : తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది.
{{/usCountry}}భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది.
{{/usCountry}}