...
...
Next Story

Lunar Eclipse 2026 : చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు

తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు చంద్రగ్రహణం ముగిసిన తర్వాత తెరుచుకున్నాయి. శుద్ధి జరిగిన తర్వాత తలుపులు తెరిచారు.

Updated on: Mar 03, 2026 08:57 PM IST
Advertisement

మార్చి 3 చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేశారు. తర్వాత శుద్ధి, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాత్రి 8 గంటల నుండి శ్రీవారి భక్తులకు దర్శనం తిరిగి ప్రారంభమైంది. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8:30 గంటల నుండి పని ప్రారంభించాయి.

  • మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూశారు.
  • దాదాపు 10.30 గంట‌ల అనంత‌రం మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అన్నప్రసాద విత‌ర‌ణ ప్రారంభం

చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం

చంద్రగ్రహ‌ణం కార‌ణంగా మంగళవారం ఉదయం 9 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్నప్రసాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.

  • తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి.. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు.
  • తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసి రాత్రి 7.30 తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు.
  • శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఉదయం 9 గంటలకు క్లోజ్ చేసి రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచారు. తర్వాత శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe