TTD Akshara Govindam 2026 : జూలై 3న అక్షర గోవిందానికి సర్వం సిద్ధం - ప్రతిరోజూ 2 బ్యాచ్‌లు
TTD Akshara Govindam 2026 : టీటీడీ ఆధ్వర్యంలో జూలై 3 నుంచి శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారుల కోసం “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
TTD Akshara Govindam 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం మరో ఆధ్యాత్మిక, సంప్రదాయబద్ధమైన విశేష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీ వకుళామాత సన్నిధిలో జూలై 3వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లు చేపడుతోంది.

బుధవారం రోజు(జులై 3) ఆలయ పరిసరాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జేఈవో డాక్టర్ ఎ. శరత్ పర్యవేక్షించారు. భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ…… కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహం, అమ్మ శబరి అవతారమైన శ్రీ వకుళామాత కరుణాకటాక్షాల నడుమ వేదోక్తంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో….. తొలి రోజున ముందస్తుగా నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరారు.
ఈ విశేష కార్యక్రమం కేవలం ఒక రోజుతో ముగిసిపోయేది కాదని…. ఇకపై నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందులో పాల్గొనాలనుకున్న భక్తులు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారికి టీటీడీ తరఫున ఉచితంగా ఒక ప్రత్యేక “అక్షర గోవిందం” కిట్‌ను అందజేయనున్నట్లు జేఈవో ప్రకటించారు.
ప్రతి రోజూ 2 బ్యాచ్ లు….
మొదటి రోజు విజయవంతం అయిన తర్వాత…. జూలై 4 నుంచి ఆలయ అర్చకుల పూర్తి పర్యవేక్షణలో ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో బ్యాచ్‌కు 25 మంది చొప్పున చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహిస్తామని వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు, చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ, క్యూలైన్ల నిర్వహణ వంటి అన్ని సౌకర్యాలు అద్భుతంగా కల్పించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే శ్రీ వకుళామాత ఆలయ సమీపంలోని యాగశాలలో వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి, శ్రీ వకుళామాతకు చతుర్‌కలశ స్నపనం, పంచగవ్య, క్షీర, జలాభిషేకాలు, వివిధ రకాల హోమాలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

