TTD Pilgrim Experience Center Tirumala : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల నిరీక్షణ సమయాన్ని కేవలం వేచి ఉండటానికే కాకుండా, అత్యంత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వినూత్న శ్రీకారం చుట్టింది. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ‘హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్’ (పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్)ను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ విశేషాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శుక్రవారం మీడియా వేదికగా వెల్లడించారు.

శుక్రవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ ‘హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్’తో పాటు నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను మీడియా ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో అదనపు ఈవో పాత్రికేయులతో సమావేశమై, ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై వారి అభిప్రాయాలు, సూచనలను సేకరించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ….. సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. అందులో భాగమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అని తెలిపారు.
ఆధ్యాత్మిక జ్ఞాన సమయం…
క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు శ్రీవారి మహత్యం, తిరుమల క్షేత్ర మహత్యం, పురాణాలు, ఆలయ నిర్మాణ విశిష్టతలను కళ్లకు కట్టేలా వివరించడమే ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం 3డీ (3D), వర్చువల్ రియాలిటీ (VR) వంటి అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. భక్తులు కేవలం దర్శనం కోసం వేచి ఉండటమే కాకుండా, ఆధ్యాత్మిక పరిపూర్ణతను, తిరుమల దివ్య చరిత్ర జ్ఞానాన్ని పొందేలా ఈ ప్రాజెక్టును రూపుదిద్దినట్లు ఆయన వివరించారు.
ఇప్పటికే 'దుర్లభ్ దర్శనం' అనే సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను సిద్ధం చేశారని, దాన్ని భారీ స్థాయిలో భక్తులకు చేరవేసేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో శ్రీవారి లీలలు, భక్తుల అనుభూతులు, తిరుమల గిరుల విశిష్టతలు, ఆలయ సేవలు, పరిపాలన మరియు దాతల వివరాలతో కూడిన నాణ్యమైన కంటెంట్‌ను క్రమం తప్పకుండా ప్రసారం చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
14 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియం….
{{/usCountry}}ఇప్పటికే 'దుర్లభ్ దర్శనం' అనే సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను సిద్ధం చేశారని, దాన్ని భారీ స్థాయిలో భక్తులకు చేరవేసేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో శ్రీవారి లీలలు, భక్తుల అనుభూతులు, తిరుమల గిరుల విశిష్టతలు, ఆలయ సేవలు, పరిపాలన మరియు దాతల వివరాలతో కూడిన నాణ్యమైన కంటెంట్‌ను క్రమం తప్పకుండా ప్రసారం చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
14 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియం….
{{/usCountry}}ముఖ్యమంత్రి ప్రారంభించిన మరొక ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అని అదనపు ఈవో తెలిపారు. తిరుమల ఆలయ పురాతన వారసత్వం, చారిత్రక కళాఖండాలు, ప్రాచీన నాణేలు, వస్తువులను ప్రదర్శించేందుకు వీలుగా దాదాపు 14 డిజిటల్ గ్యాలరీలతో మ్యూజియాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
మ్యూజియం నిర్వహణ కోసం ప్రత్యేక ప్రామాణిక నిబంధనావళి (SOP) మరియు మాన్యువల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సీసీ కెమెరాల నిఘా, శిక్షణ పొందిన సిబ్బంది నియామకం, గైడ్ల సేవలు, భద్రతా చర్యలు, మరియు కళాఖండాలకు ప్రత్యేక నంబరింగ్ వ్యవస్థను పొందుపరుస్తున్నామని, త్వరలోనే దీనిని భక్తుల సందర్శనార్థం సంపూర్ణంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
మీడియా ప్రతినిధులు ఇచ్చిన సూచనలను సానుకూలంగా స్వీకరిస్తామని…. ప్రత్యేకించి తెలుగు భాషా కంటెంట్‌ను మరింతగా పెంచడం, కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా మార్చడం వంటి సూచనలను త్వరలోనే అమలు చేస్తామని అదనపు ఈవో తెలిపారు. తిరుమల యాత్రను ప్రతి భక్తుడికీ ఒక మరువలేని ఆధ్యాత్మిక అనుభవంగా మార్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమని ఆయన ముగించారు.