...
...
Next Story

తిరుమలలో కారీరిష్టి, వరుణయాగం - ఈనెల 30 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు! సెప్టెంబర్ 3 వరకు షెడ్యూల్ ఇదే

Varuna Yagam Tirumala : లోకకళ్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో తిరుమలలో కారీరిష్టి, వరుణయాగం, పర్జన్యశాంతి హోమాలను టీటీడీ నిర్వహించనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు ధర్మగిరిలో ఇవి జరుగుతాయి.

Published on: Aug 29, 2026, 22:03:29 IST
Advertisement

Varuna Yagam Tirumala : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మహత్తర సంకల్పాన్ని చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక క్రతువులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు తిరుమలలో వరుణయాగ, పర్జన్యశాంతి సహిత కారీరిష్టి యాగాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఏర్పాట్లు….

తిరుమలలో కారీరిష్టి, వరుణయాగం
తిరుమలలో కారీరిష్టి, వరుణయాగం

తిరుమలలోని ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేదికగా ఈ ప్రత్యేక యాగ ప్రక్రియలన్నీ కొనసాగుతాయి. మొత్తం 32 మంది ప్రముఖ వేద, శ్రౌత, స్మార్త పండితులు అత్యంత నిష్ఠతో ఈ యాగ కార్యక్రమాల్లో పాల్గొని మంత్రోచ్ఛారణలు చేస్తారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక క్రతువులకు సంబంధించిన విస్తృత ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

యాగ కార్యక్రమాలు - టైమింగ్స్ వివరాలు:

ఆగస్టు 30 (ఆదివారం) : యాగ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు సాయంత్రం 7.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వైభవంగా అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం వంటి ప్రాథమిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

  • ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు : ఈ నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధర్మగిరిలో వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి హోమాలు శ్రద్ధాభక్తులతో సాగుతాయి. వీటితో పాటు ఏడు వేదశాఖల పారాయణం, శ్రీమద్రామాయణం, సుందరకాండ, మహాభారతంలోని విరాటపర్వం, వర్షాన్ని కురిపించే శక్తి కలిగిన ఋష్యశృంగ ధ్యాన పారాయణాలను వేద పండితులు జపిస్తారు.
  • గోగర్భం డ్యామ్ వద్ద ప్రత్యేక అనుష్ఠానం : యాగ రోజుల్లో ప్రతిరోజూ పవిత్రమైన గోగర్భం డ్యామ్ జలాశయం వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానాలను పండితులు ప్రత్యక్షంగా నిర్వహిస్తారు.
  • సాయంత్రం వేళల్లో అగ్నిహోత్రం : ప్రతిరోజు సాయంత్రం 6.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు ధర్మగిరి ప్రాంగణంలో అగ్నిహోత్ర అనుష్ఠానం మరియు ఏడు వేదశాఖల పారాయణ ఘట్టాలు కొనసాగుతాయి.
  • సెప్టెంబర్ 3 (పూర్ణాహుతి) : యాగాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు వేద విజ్ఞాన పీఠంలో అత్యంత శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామివారికి నివేదనలు అర్పిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe