శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి: 108 నామాలు, పారాయణం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు!

శ్రీ మహావిష్ణువుని ఆరాధన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కథనంలో శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిలోని 108 దివ్యనామాలను తెలుగులో అందించడంతో పాటు, వాటి పారాయణం వల్ల కలిగే ఆధ్యాత్మిక, మానసిక, కుటుంబపరమైన ప్రయోజనాలను వివరించాం. 

Published on: Jul 24, 2026, 12:30:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

1. ఓం విష్ణవే నమః

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి: 108 నామాలు, పారాయణం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు! (pinterest)
శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి: 108 నామాలు, పారాయణం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు! (pinterest)

2. ఓం లక్ష్మీపతయే నమః

3. ఓం కృష్ణాయ నమః

4. ఓం వైకుంఠాయ నమః

5. ఓం గరుడధ్వజాయ నమః

6. ఓం పరబ్రహ్మణ్యే నమః

7. ఓం జగన్నాథాయ నమః

8. ఓం వాసుదేవాయ నమః

9. ఓం త్రివిక్రమాయ నమః

10. ఓం దైత్యాంతకాయ నమః

11. ఓం మధురిపవే నమః

12. ఓం తార్క్ష్యవాహాయ నమః

13. ఓం సనాతనాయ నమః

14. ఓం నారాయణాయ నమః

15. ఓం పద్మనాభాయ నమః

16. ఓం హృషీకేశాయ నమః

17. ఓం సుధాప్రదాయ నమః

18. ఓం మాధవాయ నమః

19. ఓం పుండరీకాక్షాయ నమః

20. ఓం స్థితికర్త్రే నమః

21. ఓం పరాత్పరాయ నమః

22. ఓం వనమాలినే నమః

23. ఓం యజ్ఞరూపాయ నమః

24. ఓం చక్రపాణయే నమః

25. ఓం గదాధరాయ నమః

26. ఓం ఉపేంద్రాయ నమః

27. ఓం కేశవాయ నమః

28. ఓం హంసాయ నమః

29. ఓం సముద్రమథనాయ నమః

30. ఓం హరయే నమః

31. ఓం గోవిందాయ నమః

32. ఓం బ్రహ్మజనకాయ నమః

33. ఓం కైటభాసురమర్దనాయ నమః

34. ఓం శ్రీధరాయ నమః

35. ఓం కామజనకాయ నమః

36. ఓం శేషశాయినే నమః

37. ఓం చతుర్భుజాయ నమః

38. ఓం పాంచజన్యధరాయ నమః

39. ఓం శ్రీమతే నమః

40. ఓం శార్ఙ్గపాణయే నమః

41. ఓం జనార్దనాయ నమః

42. ఓం పీతాంబరధరాయ నమః

43. ఓం దేవాయ నమః

44. ఓం జగత్కారాయ నమః

45. ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః

46. ఓం మత్స్యరూపాయ నమః

47. ఓం కూర్మతనవే నమః

48. ఓం క్రోధరూపాయ నమః

49. ఓం నృకేసరిణే నమః

50. ఓం వామనాయ నమః

51. ఓం భార్గవాయ నమః

52. ఓం రామాయ నమః

53. ఓం హలినే నమః

54. ఓం కల్కినే నమః

55. ఓం హయవాహనాయ నమః

56. ఓం విశ్వంభరాయ నమః

57. ఓం శింశుమారాయ నమః

58. ఓం శ్రీకరాయ నమః

59. ఓం కపిలాయ నమః

60. ఓం ధృవాయ నమః

61. ఓం దత్తాత్రేయాయ నమః

62. ఓం అచ్యుతాయ నమః

63. ఓం అనంతాయ నమః

64. ఓం ముకుందాయ నమః

65. ఓం ఉదధివాసాయ నమః

66. ఓం శ్రీనివాసాయ నమః

67. ఓం లక్ష్మీప్రియాయ నమః

68. ఓం ప్రద్యుమ్నాయ నమః

69. ఓం పురుషోత్తమాయ నమః

70. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

71. ఓం మురారాతయే నమః

72. ఓం అధోక్షజాయ నమః

73. ఓం ఋషభాయ నమః

74. ఓం మోహినీరూపధరాయ నమః

75. ఓం సంకర్షణాయ నమః

76. ఓం పృథవే నమః

77. ఓం క్షీరాబ్ధిశాయినే నమః

78. ఓం భూతాత్మనే నమః

79. ఓం అనిరుద్ధాయ నమః

80. ఓం భక్తవత్సలాయ నమః

81. ఓం నారాయణాయ నమః

82. ఓం గజేంద్రవరదాయ నమః

83. ఓం త్రిధామ్నే నమః

84. ఓం భూతభావనాయ నమః

85. ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమః

86. ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమః

87. ఓం సూర్యమండలమధ్యగాయ నమః

88. ఓం భగవతే నమః

89. ఓం శంకరప్రియాయ నమః

90. ఓం నీలకంఠాయ నమః

91. ఓం ధరాకాంతాయ నమః

92. ఓం వేదాత్మనే నమః

93. ఓం బాదరాయణాయ నమః

94. ఓం భాగీరథీజన్మభూమి పాదపద్మాయ నమః

95. ఓం సతాంప్రభవే నమః

96. ఓం స్వభువే నమః

97. ఓం ఘనశ్యామాయ నమః

98. ఓం జగత్కారణాయ నమః

99. ఓం అవ్యయాయ నమః

100. ఓం బుద్ధావతారాయ నమః

101. ఓం శాంతాత్మనే నమః

102. ఓం లీలామానుషవిగ్రహాయ నమః

103. ఓం దామోదరాయ నమః

104. ఓం విరాడ్రూపాయ నమః

105. ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః

106. ఓం ఆదిదేవాయ నమః

107. ఓం దేవదేవాయ నమః

108. ఓం ప్రహ్లాదపరిపాలకాయ నమః

ఇతి శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి సమాప్తం..

మహావిష్ణువుని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు

మహావిష్ణువుని ఆరాధించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. విష్ణువు జగత్తుకు పాలకుడు, రక్షకుడు. విష్ణువును పూజిస్తే ఆధ్యాత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా అనేక శుభఫలితాలు కలుగుతాయి.

మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది: విష్ణువుని ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. ధనసమృద్ధి, ఐశ్వర్యం, సౌభాగ్యం పెరుగుతాయి.

పాపాలు తొలగిపోతాయి: భక్తితో విష్ణువుని ఆరాధించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అష్టోత్తర పారాయణం, సహస్రనామ పారాయణం చేస్తే పూర్వజన్మ పాపాలు క్రమంగా తొలగిపోతాయి.

కుటుంబంలో సుఖ శాంతులు: భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ఆరాధించడం వలన ఇంట్లో కలహాలు తగ్గి, దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు ఇంకా బలపడతాయి.

మానసిక ప్రశాంతత: విష్ణువుని ఆరాధించడం వలన ఆందోళన, భయం, ఒత్తిడి వంటివి తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది.

ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి: విష్ణు అనుగ్రహం కలిగి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని చూడొచ్చు. ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More