తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలికి చేదు అనుభవం ఎదురైనప్పటికీ…. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్‌కు చెందిన శ్రీపాద రాజ శృతి అనే భక్తురాలు శుక్రవారం తిరుమలలో పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని అధికారులు సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించి క్షేమంగా ఆమెకు అందజేశారు.
అసలేం జరిగిందంటే….

శ్రీపాద రాజ శృతి శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్దకు వెళ్లారు. అక్కడ నీళ్లు తాగుతున్న సమయంలో అనుకోకుండా ఆమె చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు కడియం జారి కింద పడిపోయింది. ఆమె ఆ విషయాన్ని గమనించకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. అయితే….. ఆమె వెనుకే ఉన్న కొంతమంది ఇతర భక్తులు కిందపడిన బంగారు కడియాన్ని గమనించి తీసుకున్నారు.
కడియం పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించిన భక్తురాలు ఆందోళనతో టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. కడియం కింద పడటం…. దానిని వెనుక ఉన్న భక్తులు తీసుకోవడాన్ని కెమెరా దృశ్యాల ద్వారా స్పష్టంగా గుర్తించారు.
టీటీడీ సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు….. విజిలెన్స్ అధికారి (వీజీఓ) సురేంద్ర పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ఏవీఎస్వో వెంకటరమణ, ఆయన బృందం రంగంలోకి దిగారు. సీసీటీవీ ఆధారాలతో కడియం తీసుకున్న వారిని గుర్తించి, వారి నుంచి ఆ 40 గ్రాముల బంగారు కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అసలు యజమానురాలైన శ్రీపాద రాజ శృతికి దానిని అప్పగించినట్లు ఏవీఎస్వో వెంకటరమణ వెల్లడించారు.
లక్షల విలువైన తన బంగారు కడియం తిరిగి దక్కడంతో భక్తురాలు రాజ శృతి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, వేగంగా ఆభరణాన్ని వెతికి ఇచ్చిన టీటీడీ విజిలెన్స్…. సెక్యూరిటీ అధికారులకు, సిబ్బందికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
{{/usCountry}}లక్షల విలువైన తన బంగారు కడియం తిరిగి దక్కడంతో భక్తురాలు రాజ శృతి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, వేగంగా ఆభరణాన్ని వెతికి ఇచ్చిన టీటీడీ విజిలెన్స్…. సెక్యూరిటీ అధికారులకు, సిబ్బందికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
{{/usCountry}}