...
...
Next Story

Tirumala : ఖాళీ గోనె సంచుల ఈ–వేలం - దరఖాస్తు విధానం, ఈఎండీ వివరాలు ఇవే!

తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అనుబంధ ఆలయాల్లో వాడిన ఖాళీ గోనె సంచులకు జూలై 31న ఈ-వేలం నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు జూలై 30లోపు రూ.30 వేల ఈఎండీ చెల్లించి నమోదు చేసుకోవచ్చు.

Published on: Jul 24, 2026, 15:00:50 IST
Advertisement

TTD Gunny Bags E Auction : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని వివిధ అనుబంధ ఆలయాల్లో నిత్యం నిర్వహించే కైంకర్యాలు, ప్రసాదాల తయారీకి వేలాది గోనె సంచులను వినియోగిస్తుంటారు. ఇలా ఉపయోగించిన ఖాళీ గోనె సంచులను విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

టీటీడీ ఖాళీ గోనె సంచుల ఈ–వేలం
టీటీడీ ఖాళీ గోనె సంచుల ఈ–వేలం

2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఒక ఏడాది కాలానికి గాను "రేట్ కాంట్రాక్ట్" ప్రాతిపదికన ఈ గోనె సంచులను విక్రయించనున్నారు. ఇందుకోసం వచ్చే జూలై 31వ తేదీన బహిరంగ ఈ-వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు గురువారం తెలిపారు.

వేలంలో పాల్గొనే విధానం….

ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యాపారులు, వ్యక్తులు, లేదా సంస్థలు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో పాల్గొనాలనుకునేవారు జూలై 30వ తేదీ సాయంత్రంలోగా 'కొనుగోలు' పోర్టల్ ద్వారా రూ.30,000 ప్రాథమిక డిపాజిట్ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఈఎండీ చెల్లించిన వారిని మాత్రమే ఈ-వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.

ఈ-వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకోవడానికి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన https://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వేలం ప్రక్రియ, ఇతర సాంకేతిక వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. సమాచారం కోసం 0877-2264429 ఫోన్ నంబర్‌లో గానీ, లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ఐడీ ద్వారా గానీ అధికారులను సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe