మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
తిరుపతిలో నవంబర్ 30న కార్తీక మహాదీపోత్సవం - సామూహిక లక్ష్మీ నీరాజనం
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 30న తిరుపతిలోని టీటీడీ పరేడ్ మైదానంలో కార్తీక మహాదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
పవిత్ర కార్తీక మాస శోభను మరింత పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని పరేడ్ మైదానం ఈ ఆధ్యాత్మిక వేడుకకు వేదిక కానుంది. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు భక్తిప్రపత్తులు వెల్లివిరిసేలా విశేష పూజలు, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ అధికారులు రూపొందించారు.

విశేష పూజలు, నృత్య రూపకాలు….
మహాదీపోత్సవంలో భాగంగా కార్తీక దీప ప్రజ్వలన విశిష్టతను చాటుతూ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొలుత శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజలను భక్తిశ్రద్ధలతో జరిపిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాకారులు ప్రదర్శించే 'హరిహర కార్తీక' నృత్య రూపకం, మధురమైన భక్తిగీతాలాపన, 'అష్టలక్ష్మీ వైభవం' నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వేడుక చివరలో అమ్మవారికి, స్వామివారికి కుంభహారతి, నక్షత్రహారతి, మంగళహారతులను సమర్పిస్తారు.
సామూహిక లక్ష్మీ నీరాజనం….
ఈ మహాదీపోత్సవంలో వందలాది మంది మహిళలు ఒకే వేదికపై సామూహికంగా కార్తీక దీపాలను వెలిగించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి 'లక్ష్మీ నీరాజనం' సమర్పించనున్నారు. వేలాది దీపాల కాంతులతో పరేడ్ మైదానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహంతో సమస్త ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ లోకక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కార్తీక దీపారాధనలోని ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని నేటి తరానికి చాటిచెప్పడంతో పాటు, భక్తుల్లో భక్తిభావాన్ని, దైవచింతనను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది.
తిరుపతికి రాలేని భక్తులు సైతం ఈ మహాదీపోత్సవ పుణ్యఫలాన్ని పొందేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ అపురూప వేడుకను వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

E-Paper
