...
...
Next Story

విజయవాడ, వరంగల్ మీదుగా భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు - షెడ్యూల్ వివరాలు ఇవే!

ఆధ్యాత్మిక యాత్రికుల కోసం విజయవాడ, వరంగల్ మీదుగా భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో( www.irctctourism.com/bharatgaurav) ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Published on: Jun 5, 2026, 12:26:28 IST
Advertisement

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ఆధ్యాత్మిక యాత్రికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. విజయవాడ మీదుగా రెండు భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు వేర్వేరు తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను ఆపరేట్ చేయనున్నట్లు అధికారులు వివరించారు.

మొదటి రైలు షెడ్యూల్ వివరాలు :

విజయవాడ మీదుగా రెండు భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు
విజయవాడ మీదుగా రెండు భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు

తొలి భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటలకు ఇందౌర్‌లో బయల్దేరుతుంది. ఆ తర్వాత వివిధ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ…. మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు బలార్షా చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి 11వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు విజయవాడకు…. అదే రోజు రాత్రి 11.00 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణికులను తీసుకుని 14వ తేదీ ఉదయం 7.00 గంటలకు ప్రముఖ శైవక్షేత్రం రామేశ్వరం చేరుకుంటుంది.

రెండో రైలు షెడ్యూల్ వివరాలు

మరో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీన కుదాల్‌నగర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైలు 19వ తేదీ అర్ధరాత్రి 2.00 గంటలకు గూడూరు జంక్షన్ చేరుకుంటుంది. అనంతరం అదే రోజు రాత్రి 2.30 గంటలకు నెల్లూరు….. తెల్లవారుజామున 4.00 గంటలకు ఒంగోలు, 4.45 గంటలకు చీరాల స్టేషన్లకు వస్తుంది.

ఉదయం 7.00 గంటలకు విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.00 గంటలకు వరంగల్ కు చేరుకుటుంది. సాయంత్రం 5.00 గంటలకు బలార్షా మీదుగా ప్రయాణిస్తుంది. చివరగా ఈ రైలు 22వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమ్‌నాథ్‌కు చేరుకుంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe