ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగం, ఉద్యానవన (హార్టికల్చర్) పంటల రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఒక భారీ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల కోసం సమగ్రమైన వాల్యూ చైన్ రూపొందించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.

ఈ ప్రతిపాదిత భాగస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఈ ఏడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' వార్షిక సదస్సులో ప్రారంభమయ్యాయి. ఆ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో ఆహార క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు యూఏఈ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆ నాడు చేసుకున్న ప్రాథమిక అంచనాలకు కొనసాగింపుగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఆచరణలోకి తీసుకురావడానికి ఇరు వర్గాలు కీలక అడుగులు వేశాయి.
మామిడి, అరటి, కోకోఈ సమగ్ర విలువ ఆధారిత వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి పలు ప్రధాన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేయడానికి మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలోని నాణ్యమైన మామిడి రకాలకు గల్ఫ్, ఇతర విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్ కల్పించడం లక్ష్యంగా ఉంది. అరటి రవాణా నష్టాలను తగ్గించి, సుదీర్ఘకాలం నిల్వ ఉండేలా కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనున్నారు.
కోకో సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రాసెస్ చేసి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేయడం, ఏపీలోని ఇతర ప్రధాన పండ్లు, కూరగాయలను కూడా ఈ గ్లోబల్ సప్లై చైన్‌కు అనుసంధానించనుంది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘమైన తీరప్రాంతం, సారవంతమైన నేలలు ఉండటం వల్ల ఉద్యానవన పంటల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో ఉంది. అయితే సరైన నిల్వ వసతులు, ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ సాంకేతికత లేకపోవడం వల్ల రైతులు ఇప్పటివరకు నష్టపోతున్నారు. యూఏఈ భాగస్వామ్యంతో ఏర్పాటుకాబోయే ఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పంట దిగుబడి నేరుగా అమ్మడం మాత్రమే కాకుండా, ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు ఎగుమతి చేస్తారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, విదేశీ మార్కెట్లకు నేరుగా అనుసంధానం కావడం వల్ల రైతులకు మెరుగైన మద్దతు ధర లభిస్తుంది.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘమైన తీరప్రాంతం, సారవంతమైన నేలలు ఉండటం వల్ల ఉద్యానవన పంటల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో ఉంది. అయితే సరైన నిల్వ వసతులు, ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ సాంకేతికత లేకపోవడం వల్ల రైతులు ఇప్పటివరకు నష్టపోతున్నారు. యూఏఈ భాగస్వామ్యంతో ఏర్పాటుకాబోయే ఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పంట దిగుబడి నేరుగా అమ్మడం మాత్రమే కాకుండా, ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు ఎగుమతి చేస్తారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, విదేశీ మార్కెట్లకు నేరుగా అనుసంధానం కావడం వల్ల రైతులకు మెరుగైన మద్దతు ధర లభిస్తుంది.
{{/usCountry}}ఆహార శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్, కోల్డ్ స్టోరేజ్, రవాణా రంగాలలో వేలాది మంది యువతకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్‌తో పాటు ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) అధికారులు పాల్గొన్నారు. యూఏఈ ప్రతినిధి బృందంతో కలిసి ప్రాజెక్టు అమలు, భూ కేటాయింపులు, రవాణా సౌకర్యాలు, ఇన్వెస్ట్‌మెంట్ రోడ్‌మ్యాప్‌పై సమగ్రంగా చర్చించారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, ప్రత్యేకించి వ్యవసాయ, ఉద్యానవన రంగానికి ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణులు భావిస్తున్నారు.