ఏపీ శాసన మండలి సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే అంశాల వారీగా చర్చలు జరుగుతుండగా… ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి ఫొటోలను సభలో ప్రదర్శించారు. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని ఆ పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరించారు.
శ్రీవారి ఫొటోల ప్రదర్శన…

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి ఇచ్చిన తీర్మానాన్ని కూడా ఛైర్మన్ తిరస్కరించారు. వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని సభలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఛైర్మన్ వారించినప్పటికీ… వైసీపీ ఎమ్మెల్సీలు తమ నిరసనను కొనసాగించారు.
వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ఫొటోల ప్రదర్శన చాలా అభ్యంతరకరమన్నారు. 'ఛైర్మన్ సార్… వెంకటేశ్వర స్వామి ఫొటోలతో వారు ప్రవర్తిస్తున్న తీరు ఏ మాత్రం సరికాదు. అసలు వారికి దేవుడంటే గౌరవం ఉందా? దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగతారా…?' అని కేశవ్ ప్రశ్నించారు. “దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదు. వారికి (వైసీపీ ఎమ్మెల్సీలు) దేవుడిపై నమ్మకం లేదు. దేవుణ్ణి గౌరవించరు.. దేవుని పట్ల భయం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలిలో ఫొటోల ప్రదర్శనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు వైఎస్ జగన్. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదు. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా కౌన్సిల్ లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్ళిపోవడం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఏపీ శాసనమండలిని సోమవారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
బొత్స కామెంట్స్…
{{/usCountry}}మరోవైపు ఏపీ శాసనమండలిని సోమవారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
బొత్స కామెంట్స్…
{{/usCountry}}ఇక మండలి నుంచి బయటికి వచ్చిన తర్వాతా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడారు. చెప్పులు వేసుకుని స్వామి ఫోటో పట్టుకుని దేవుడిని అవమానించారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చెప్పులు వేసుకుని పూజలు చేసే వాళ్లు మా గురించి మాట్లాడేది ఏంటి అంటూ ప్రశ్నించారు. మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను కింద పడేసినట్టు ఉన్న ఒక ఫోటో చూపించాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బొత్స…. చంద్రబాబు ఫొటోలను కొన్నింటిని మీడియాకు చూపించారు. హెరిటేజ్ మీద చర్చకు రావడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు.