...
...
Next Story

మున్సిపల్ పోరులో జనసేన జోరు - విజయవాడ మేయర్ గా వంగవీటి రాధా భారీ విజయం

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. విజయవాడ మేయర్ స్థానాన్ని జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ సొంతం చేసుకోగా… పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Published on: Nov 4, 2026, 11:47:29 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. పట్టణ స్థానిక సంస్థల్లో అత్యధిక పీఠాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ తమకు కేటాయించిన అన్ని మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుని 100 శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసుకుంది.

విజయవాడ పీఠంపై జనసేన జెండా…

వంగవీటి రాధా
వంగవీటి రాధా

అత్యంత ఉత్కంఠ రేపిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ రికార్డు స్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై రాధాకృష్ణ 1,30,872 ఓట్ల భారీ వ్యత్యాసంతో విజయాన్ని అందుకున్నారు. పోలైన ఓట్లలో వంగవీటి రాధాకృష్ణకు 2,65,888 ఓట్లు రాగా, రాయన భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు 11 వేలకుపైగా ఓట్లు దక్కాయి.

విజయవాడ కార్పొరేషన్‌లోని మొత్తం 86 డివిజన్లలో… కూటమి 72 డివిజన్లలో పాగా వేసింది. ఇందులో తెలుగుదేశం పార్టీ 53, జనసేన 19, బీజేపీ 4 డివిజన్లను కైవసం చేసుకున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ 8 డివిజన్లకే పరిమితం కాగా… సీపీఐ(ఎం), ఒక స్వతంత్ర అభ్యర్థి తలో డివిజన్‌ను గెలుచుకున్నారు.

స్పష్టమైన తీర్పునిచ్చారు - వంగవీటి రాధా

ఈ ఘనవిజయంపై రాధాకృష్ణ స్పందిస్తూ…. విజయవాడ నగర అభివృద్ధికి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. నిరంతరం కష్టపడి పనిచేసిన కూటమి నాయకులు, శ్రేణులకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లను ఎన్డీఏ కూటమి దక్కించుకోగా, వైఎస్సార్‌సీపీ కేవలం అనంతపురం కార్పొరేషన్‌కే పరిమితమైంది. ఎన్నికల తీర్పుతో రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎన్డీఏ కూటమి పూర్తి పట్టు సాధించగా… ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ అనేక స్థానిక సంస్థల్లో తీవ్ర నిరాశకు గురైంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks