Vangaveeti Radha : విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణస్వీకారం

Vangaveeti Radha : ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. విజయవాడ, గుంటూరు సహా ఇతర మున్సిపాలిటీల కొత్త మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.

Published on: Nov 23, 2026, 13:49:47 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన తొలి ప్రత్యేక సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చట్టాల ప్రకారం నేటి నుంచే వీరి ఐదేళ్ల పదవీకాలం అధికారికంగా ప్రారంభమైంది.

వంగవీటి రాధా ప్రమాణస్వీకారం
వంగవీటి రాధా ప్రమాణస్వీకారం

మేయర్‌ల ప్రమాణస్వీకారం

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి క్రాంతి శ్రీ ప్రమాణం చేశారు. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ (జనసేన) బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం 119 మంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్ ప్రమాణం చేశారు. తండ్రి మరణం కారణంగా మేయర్ ముక్కా శ్రావణి నేడు ప్రమాణ స్వీకారం చేయలేదు. మచిలీపట్నం మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదా ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, కర్నూలు మేయర్‌గా బొల్లెద్దుల విజయ ప్రత్యూష, నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్, చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత ప్రమాణ స్వీకారం జరిగింది.

మున్సిపాలిటీలలో నూతన ఛైర్మన్లు

డోన్ ఛైర్‌పర్సన్‌గా కోట్ల సుజాతమ్మ, తిరువూరులో పసుపులేటి మాధవి (జనసేన), జగ్గయ్యపేటలో నరేంద్రుల వినీత, కొండపల్లిలో కన్నెగంటి అమూల్య, కొవ్వూరులో కంఠశని విజయలక్ష్మి, సత్తెనపల్లిలో మారెళ్ల రామాంజనేయులు, అద్దంకిలో కాకాణి అశోక్, దర్శిలో దారం సుబ్బారావు, చీమకుర్తిలో శిద్దా సుధాకర్, కనిగిరిలో అచ్చాల తిరుపతమ్మ, గిద్దలూరులో డాక్టర్ జేవీ నారాయణ (బీజేపీ), చీరాలలో హనీ స్పందనతోపాటుగా ఇతర మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఛైర్మన్లు బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో టీడీపీ 10 చోట్ల మేయర్, 7 చోట్ల డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. జనసేనకు విజయవాడ, ఏలూరు మేయర్ పదవులతో పాటు విశాఖ, గుంటూరు, మచిలీపట్నం, తిరుపతిలలో డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. ఇక 87 మున్సిపాలిటీలలో టీడీపీకి 59, జనసేనకు 19 వైస్ ఛైర్‌పర్సన్ స్థానాలు దక్కగా, వైసీపీ కేవలం రెండు చోట్ల (బేతంచర్ల, నందికొట్కూరు) మాత్రమే పరిమితమైంది.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.