తీవ్ర తుఫాన్ ‘మురసు’ దక్షిణ తీరప్రాంతాన్ని వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) పరిధిలోని విజయవాడ డివిజన్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ - గూడూరు మధ్య వాతావరణ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వర్షాలు, బలమైన గాలుల తీవ్రతకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విజయవాడ – ఒంగోలు – గూడూరు సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే యంత్రాంగం నవంబర్ 03, 2026న నడిచే పలు కీలక రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విజయవాడ, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, నరసాపురం, రాజమండ్రి మరియు చెన్నై వైపు వెళ్లే ప్రయాణికులు ఈ రైళ్ల రద్దు సమాచారాన్ని గమనించాలని కోరింది.
రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు:
- రైలు నంబరు 67260 : బిట్రగుంట నుంచి విజయవాడ
- రైలు నంబరు 17260 : విజయవాడ నుంచి గూడూరు
- రైలు నంబరు 67203 : గూడూరు నుంచి రేణిగుంట
- రైలు నంబరు 67204 : రేణిగుంట నుంచి నెల్లూరు
- రైలు నంబరు 17259 : నెల్లూరు నుంచి విజయవాడ
- రైలు నంబరు 67258 : విజయవాడ నుంచి నరసాపురం
- రైలు నంబరు 67246 : నరసాపురం నుంచి రాజమండ్రి
- రైలు నంబరు 67273 : విజయవాడ నుంచి ఒంగోలు
- రైలు నంబరు 67274 : ఒంగోలు నుంచి విజయవాడ
- రైలు నంబరు 12711 : విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (పినాకిని ఎక్స్‌ప్రెస్)
- రైలు నంబరు 12712 : ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ (పినాకిని ఎక్స్‌ప్రెస్)
రైళ్ల రద్దు సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. రైళ్ల పునరుద్ధరణ లేదా తదుపరి వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ (www.irctc.co.in) అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించాలని సూచించారు.
{{/usCountry}}రైళ్ల రద్దు సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. రైళ్ల పునరుద్ధరణ లేదా తదుపరి వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ (www.irctc.co.in) అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించాలని సూచించారు.
{{/usCountry}}