విజయవాడ దుర్గగుడిలో అపచార ఘటనపై ఈవో కీలగ ఆదేశాలు.. బాధ్యులకు నోటీసులు
విజయవాడ దుర్గగుడిలో అపచారం ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ అయ్యాయి. ఈ ఘటనపై ఈవోకు నివేదిక అందజేసింది కమిటీ. అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు ఉన్నట్టుగా గుర్తించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందించారు. ఈ ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ చేశారు. ఇప్పటికే అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేసిన కమిటీ.. నివేదికను ఈవోకు అందజేసింది. అమ్మవారి అభిషేకం కోసం ఉపయోగించిన పాలలో పురుగులు ఉన్నట్టుగా కమిటీ గుర్తించింది.

అంతేకాదు అభిషేకానికి వాడిని బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఘటనకు కారణం అని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలో పాలు పోసి అభిషేకం చేసినట్టుగా తెలిసింది. ఈ అపచార ఘటనలో భాగంగా స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి నోటీసులు జారీ అయ్యాయి. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈవో. ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం తప్పని కమిటీ పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే.. రెండు రోజుల శ్రీచక్ర అర్చనలో అభిషేకానికి ఉపయోగించిన పాలలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. పురుగులను గుర్తించిన అర్చకులు.. వెంటనే అర్చనను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మీద ఈవో శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చారు. స్థానాచార్చులు శివ ప్రసాదశర్మ నేతృత్వంలో కమిటీ వేశారు. కమిటీ విచారణ చేసి నివేదికను సమర్పించింది.
పూజా విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడినట్టుగా కమిటీ నివేదికలో తెలిపింది. శ్రీచక్ర అర్చన నిర్వహించే అర్చకుడికి మెమో జారీ చేయడంతోపాటుగా అంతర్గతంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అంతేకాదు స్టోర్, పూజల విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సంప్రదాయాలకు కట్టుబడి, నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని ఈవో చెప్పారు. కమిటీ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆలయ ఈవో పంపనున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


