...
...
Next Story

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఇక అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే.. దేవస్థానం కీలక నిర్ణయం

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఇక అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే ఉండనున్నాయి. ఈ మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Published on: Dec 18, 2025 10:38 AM IST
Advertisement

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(కనక దుర్గ ఆలయం) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శన టికెట్లతోపాటుగా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు దేవస్థానం.. భక్తులకు పారదర్శకతను పెంచడానికి, సౌకర్యార్థం త్వరలో మెుత్తం ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఈ వివరాలు వెల్లడించారు.

విజయవాడ దుర్మమ్మ గుడి
విజయవాడ దుర్మమ్మ గుడి

దర్శనం టిక్కెట్లు, సేవా బుకింగ్‌లు, ప్రసాదం, విరాళాలు, రిజిస్ట్రేషన్లు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని దేవస్థానం వెల్లడించింది. ముందుగానే టిక్కెట్లను బుక్‌ చేసుకునేందుకు www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్లులో బుక్ చేయవచ్చు. లేదంటే కనకదుర్గమ్మ ఆలయ మొబైల్‌ యాప్‌, మనమిత్ర వాట్సప్‌ సేవ 9552300009 కూడా చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేస్తారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానంలో నగదు రహిత చెల్లింపులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్శనాలు, ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలు, కేశఖండన, అన్ని విరాళాలు.. ఇకపై డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరపనున్నారు. భక్తులు ఈ సేవలను ఉపయోగించాలని దేవస్థానం కోరింది. డిజిటల్ చెల్లింపులతో అక్రమాలకు అడ్డుపడనుంది. ఇప్పటిదాకా ఎక్కువగా భౌతికంగానే టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్స్‌తో నేరుగా దేవస్థానం ఖాతాలోకి వెళ్తాయి.

ఆన్‌లైన్ విరాళాలు, ఇ-హుండీ, దర్శనం, సేవా బుకింగ్‌లు త్వరలో www.aptemple.org, http://www.aptemples.org, మన మిత్ర యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని ఈవో శీనానాయక్ చెప్పారు.

2025 భవాని దీక్ష సమయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక మొబైల్ యాప్, 300కు పైగా సీసీటీవీ కెమెరాలకు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఉపయోగించినట్లు దేవస్థానం తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ దీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఇందులో సుమారు 6 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ ఈవో చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe