విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా, పంచదశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా కొలువొందే శ్రీ లలితా దేవి రూపాన్ని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరకుగడ చేతిలో పట్టుకొని ఉంటుంది. శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయానికి పరమేశ్వరుడు మహా కామేశ్వరుడిగా, అమ్మవారు మహా త్రిపుర సుందరీదేవిగా పూజలు అందుకుంటారు.
లలితా దేవి ప్రకృతి శక్తికి, మన చుట్టూ ఉన్న పంచభూతాలకు ప్రతీక. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు తన్మాత్రలలో అంతర్లీనంగా ఉండే పరాశక్తిగా లలితా దేవిని ఉపాసిస్తారు. ఈ దేవిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక పరిపక్వతతో పాటు సాధకులలో సౌమ్యత, చిత్తశాంతి, సర్వవిధ సౌభాగ్యాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 'అమ్మవారిని దర్శించుకోవడం మహాద్భాగ్యంగా భావిస్తున్నాను. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుర్గగుడి పాలకమండలి, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేషనల్ సరస్ ప్రదర్శనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విచ్చేస్తుండటం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం.' అని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ కలసి భారీ భద్రతా, రవాణా ఏర్పాట్లు చేశాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ కలసి భారీ భద్రతా, రవాణా ఏర్పాట్లు చేశాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}సిసిటీవీల ద్వారా నిరంతర నిఘా ఉంచుతూ, వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా కనకదుర్గమ్మ ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం నిరంతరాయంగా అందేలా కౌంటర్లు పెంచారు. అమ్మవారి దసరా వేడుకలు విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక కోలాహలంలో ముంచెత్తుతున్నాయి.