విజయవాడ నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా దసరా శరన్నవరాత్రుల వేళ 'విజయవాడ ఉత్సవ్-2.0'ను అత్యంత వేడుకగా నిర్వహించబోతున్నారు. ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు తదితర అనేక వర్గాలకు ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.

"విజయవాడ ఉత్సవ్ వంటి బృహత్తర కార్యక్రమాలు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా, స్థానిక ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థానిక ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తాయి," అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 'సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ' నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఈ కార్యక్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
కనుమరుగవుతున్న తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలను, పౌరాణిక పద్య నాటకాలను కాపాడుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఇవి యువతలో వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ…. దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు, ప్రజలంతా సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు చేపడుతున్నట్లు చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల జిల్లా స్థూల ఉత్పత్తి పెరుగుతుందని…. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ సంబంధాల బలోపేతానికి తోడ్పడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా ఈ విజయవాడ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ…. అక్టోబర్ 11 నుంచి 20 వరకు 'విజయవాడ ఉత్సవ్-2.0'ను నగరంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్, సిద్ధార్థ సైన్స్ కళాశాల ప్రాంగణాల్లో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ నెల 8 నుంచి 23 వరకు పున్నమి ఘాట్లో జాతీయ స్థాయి 'సరస్ మేళా'ను తొలిసారిగా విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం 650 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
{{/usCountry}}విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ…. అక్టోబర్ 11 నుంచి 20 వరకు 'విజయవాడ ఉత్సవ్-2.0'ను నగరంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్, సిద్ధార్థ సైన్స్ కళాశాల ప్రాంగణాల్లో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ నెల 8 నుంచి 23 వరకు పున్నమి ఘాట్లో జాతీయ స్థాయి 'సరస్ మేళా'ను తొలిసారిగా విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం 650 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
{{/usCountry}}